Wedding Muhurtham: పెళ్లి ముహూర్తాలు మళ్లీ షూరు కానున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి జూన్ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు అలాగే 25, 26న, మార్చి 4 నుంచి 8 వరకు, అలాగే 11 నుంచి 14 వరకు, 20, 21, 25, 29న పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలని పండితులు చెబుతున్నారు.
Also Read: బంగ్లా ప్రధానిగా 17న తారిక్ రహమాన్ ప్రమాణం.. మోదీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు ఎందుకు లేవంటే?
ఇక ఏప్రిల్ 14, 16, 18 నుంచి 21 వరకు, 25, 29, 30న, మే 1, 5, 6, 8, 15, 17, 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 1, 2, 4, 7 తేదీల్లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత శుభముహూర్తాలు వచ్చాయి.
నిరుడు నవంబర్ 26న శుక్ర మూఢమి ప్రారంభంతో అప్పటి నుంచి పెళ్లి ముహుర్తాలు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు నిండిపోనున్నాయి.
ఇప్పటికే ఫంక్షన్ హాల్స్‌కు డిమాండ్ పెరిగింది. బుకింగ్‌ల మీద బుకింగ్‌లు జరుగుతున్నాయి. శుభముహూర్తాలు నాలుగు నెలల పాటు ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది.