Dead Person Items Astrology : చనిపోయిన వారి బంగారం, బట్టలు, వస్తువులు ఇంట్లో ఉంచుకున్నారా… వాటిని వాడుకుంటే జరిగిదే ఇదే..!

Dead Person Items Astrology : చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు, బంగారం వంటి వాటిని వాడుకోవచ్చా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..

Can we keep the gold clothes and belongings of the deceased at home

Dead Person Items Astrology : కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ బాధ కొన్ని ఏళ్ల వరకు పోదు.. కొందరైతే జీవితాంతం బాధపడుతుంటారు. ఇక చనిపోయిన వారికి సంబంధించి సమాజంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు, దుస్తులు, ఆభరణాలను వాడుకోవచ్చా.. వాడుకుంటే ఏదైనా చెడు జరుగుతుందా.. అసలు వాటిని ఏం చేయాలి.. ఎవరికైనా దానం ఇవ్వొచ్చా.. పడేయాలా ఇలా అనేక సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి అన్ని ప్రశ్నలకు పండితులు సమాధానాలు చెబుతున్నారు.

చనిపోయిన వారి వస్తువులను, ముఖ్యంగా దుస్తులను ఉపయోగించవచ్చా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో ప్రజల్లో పెరుగుతున్న అపోహలను మరియు భయాల గురించి పండితులు వివరణాలు ఇస్తున్నారు. చనిపోయిన వారికి సంబంధించి కుటుంబ ఆచారాలే ముఖ్యం అంటున్నారు పండితులు. ప్రతి కులానికి, ప్రాంతానికి వేర్వేరు ఆచారాలు ఉంటాయి. కనుక వాటిని చూసి మీరు కంగారు పడవద్దని సూచిస్తున్నారు. అలాగే వ్యక్తి మరణించిన సమయంలో వారి శరీరంపై ఉన్న బట్టలు, వారు పడుకున్న మంచం లేదా దుప్పట్లు వంటి వస్తువులను సాధారణంగా పారేయడం లేదా ఇతరులకు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అయితే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలే ఉన్నాయంటున్నారు.

అలాగే చనిపోయిన వ్యక్తులకు సంబంధించి బీరువాలో లేదా అల్మారాల్లో ఉన్న కొత్త బట్టలు, పట్టుచీరలు, బంగారం మరియు వెండి వస్తువులు ఉంటే వాటిని నిరభ్యంతరంగా కుటుంబ సభ్యులు వాడుకోవచ్చని చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోతే.. తల్లి చీరలు లేదా తండ్రి చొక్కాలను పిల్లలు వేసుకోవడం వల్ల వారి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, అది మంచిదే కానీ చెడు కాదంటున్నారు. అయితే చనిపోయిన వారు ధరించిన బంగారు ఆభరణాలను శుద్ధి చేసిన తర్వాత ఇంట్లో ఉంచుకోవచ్చు. బంగారం ఎప్పటికీ అపవిత్రం కాదు కాబట్టి, దానిని గంగాజలంతో శుద్ధి చేసి లేదా ఇంట్లోని దేవుడి పటాల వద్ద ఉంచి పూజించిన తర్వాత వారసులు ధరించవచ్చు. దీనిని వారి ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే వారు చనిపోయే సమయంలో ఒంటిపై ఉన్న బంగారాన్ని మాత్రం తీసివేసి శుద్ధి చేయాల్సి ఉంటుంది.

చనిపోయిన వారి వస్తువులు వాడితే ఆత్మ బాధపడుతుందని లేదా ఏదో కీడు జరుగుతుందని చెప్పే మాటలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు. చనిపోయిన మనుషులు ఈ లోకం విడిచి వెళ్లిపోయాక వారు సంపాదించిన ఆస్తిని, నగలను ఎలా తీసుకుంటామో, బట్టలను కూడా అలాగే చూడాలని చెబుతున్నారు. సరిగా చెప్పాలంటే.. మరణించిన వారి శరీరంపై ఉన్న వస్త్రాలను తప్పించి.. మిగిలిన వస్తువులను వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు పండితులు. ఒకవేళ భయపడుతుంటే వాటిని ఎవరికైనా దానం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు.

గమనిక : పాఠకుల ఆసక్తి మేరకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.