×
Ad

రాహు దోషము తొలగాలంటే.. అష్టకష్టాలు, మీకున్న ఆపదలు తొలిగి సుఖశాంతులతో ఉండాలంటే ఇలా చేయండి..

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు చదవండి..

రాహువు ఆరాధనలో దుర్గాదేవి ప్రాశస్త్యము

రాహు దోషము తొలగాలంటే.. రాహువు గ్రహముతో పాటు రాహువుకు అధిష్ఠాన దేవత అయిన ‘దుర్గాదేవి’ అనుగ్రహము పొందటం కూడా ముఖ్యము. దుర్గాదేవి గురించి తెలుసుకుందాము. ఈ కింది శ్లోకము గురించి తెలుసుకోవాలి.

శ్లో॥ భవాని స్తోత్రం త్వాంప్రభవతి చతుర్భిర్నవదనైః
ప్రజానా మీశాన స్త్రిపుర మథనః పంచభిరపి
నషడ్భిస్సేనానీర్దశ శతముఖై రప్యహిపతిః
తదాన్వేషాం కేషాకథయ కథ మస్మిన్నవసరః॥

పై శ్లోకము ఆనందలహరిలో శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారి గురించి రాశారు. పై శ్లోకము అర్ధము ఏమిటంటే అమ్మా! భవానీ! సృష్టికర్తయైన బ్రహ్మకు నాలుగు ముఖములు ఉన్నాయి. పరమేశ్వరుడికి ఐదు ముఖములు ఉన్నాయి.

షణ్ముఖుడు కుమారస్వామికి ఆరు ముఖములు ఉన్నాయి. నాగరాజైన ఆదిశేషుడికి వెయ్యి ముఖములు ఉన్నాయి. కానీ ఆదిశేషుడికి వెయ్యి ముఖములకు రెండు వేల నాలుకలు ఉంటాయి. నాల్గునాలుకల బ్రహ్మ మొదలు రెండువేల నాలుకలున్న ఆదిశేషుడి వరకు గల అందరూ నీమహిమలను వర్ణించలేరు గదా.

వారే వర్ణించలేకపోతే నేను మానవ మాత్రుణ్ణి నేనేమని వర్ణించగలను.. తల్లీ! అని అన్నారు. రాహుదోషమునకు అమ్మవారి అనుగ్రహము కావాలి. అష్టకష్టాలు అన్నీ ఆపదలు తొలగి సుఖశాంతులతో ఉంటారు. అందుకే దుర్గాదేవి 32
నామాలను పఠించవలెను.

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ దుర్గ సౌధినీ దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా
దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
దుర్గ మార్గప్రదాదుర్గమవిద్యా దుర్గ మాశ్రితా
దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యాన భాసినీ
దుర్గమోహా దుర్గముగా దుర్గమార్ధ స్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధ ధారిణీ
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ
దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః

పై మంత్రమును 108 సార్లు ఈ దుర్గాస్తవమును పారాయణ చేస్తే కోరికలు నెరవేరుతాయి. పారాయణము చేసినతర్వాత ఎర్రనిపూలతో అమ్మవారిని పూజించాలి.

ఉపాఖ్యానము

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ!
త్వమర్ధానాం మూలం ధనద, నమనీ యాంఘికమలే!
త్వమాది కామానాం జనని! కృత కందర్ప విజయే!
సతాం ముక్తేర్భీజం త్వమసి పరబ్రహ్మ మహిషీ!

పైన రాసిన దుర్గాదేవి ఉపాఖ్యానము విన్న వారికి విపత్తులు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది. అందువల్ల రాహుదోషము తొలగాలంటే రాహువుకు విరుగుడు దుర్గాదేవి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956