×
Ad

రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు.. వింతగా ప్రవర్తిస్తున్నారా?

విదేశాలకు వెళ్లటం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అలవాట్లు, అనుభూతులు, అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట్లు, కొత్త వేషభాషలు కల్గించడంలో గారడీ ఆ చేయించే శక్తి కలవాడు రాహువు. అ

Rahu graha (Image Credit To Original Source)

Kaal Sarp Yog: జ్యోతిష్య శాస్త్రంలో రాహువుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రాహువు అన్ని గ్రహములు రవి వలల్ల అస్తంగతులైతే, సూర్యచంద్రుల సహితం నిస్తేజులుగా చేయగలిగిన వాడు రాహువు. అందువల్లనేమో ఈయన స్తోత్రంలో ‘చంద్రాదిత్య విమర్థనం’ అని ఉంటుంది. మర్థించే శక్తి రాహువుకు కలదని తెలుస్తుంది.

సృష్టిలో అతిశక్తిమంతమైన అగ్నిగోళము ప్రాణశక్తికి కారకుడైన సూర్యుని మనోశక్తి కారకుడైన చంద్రుని మర్థించేశక్తి కూడా రాహువుకు ఉంటుంది. ‘శనివత్ రాహుః’ అని శని ఫలితాలు రాహువు ఫలితాలు సమానము. శనివలె రాహువు కూడ కర్మగ్రహం పూర్వజన్మ కర్మలు అన్ని అతివిడ్డూరంగా అనుభవింపచేయగలడు.

దుష్ట స్వభావం కలవారిని అందలం ఎక్కడానికి సాహస కార్యక్రమాలు మా చేపట్టే వారికి చేయూత నివ్వడానికి ఈ రాహుగ్రహం బాగా సహకరిస్తాడు. ఇలాగే రాహు మహాదశ బాగులేనివారు పడేపాట్లు చాలా ఉన్నాయి.

ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి రాహుదశకాని, అంతర్థశకాని జరుగుతున్నప్పుడు తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మలో ఒకరికి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. అలాగే, అల్పులను కూడా అందలం ఎక్కించే స్వభావం కూడా ఉంటుంది.

విదేశాలకు వెళ్లటం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అలవాట్లు, అనుభూతులు, అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట్లు, కొత్త వేషభాషలు కల్గించడంలో గారడీ ఆ చేయించే శక్తి కలవాడు రాహువు. అలాగే, కొత్త వస్తువులు రకరకాల వింత జబ్బులు, వింతపోకడలు, వింతప్రవర్తనలు కల్గించడంలో ఈ రాహువు సిద్ధహస్తుడు.