Kanya Rasi Phalalu 2026 : కన్య రాశి వారికి అలర్ట్.. ప్రేమించిన వారే మోసం చేసే ఛాన్స్.. మొబైల్ కి దూరంగా ఉంటే మంచిది..!
Kanya Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదంటున్నారు పండితులు.
- Dharani Pilli
- Published On : March 15, 2026 / 09:55 PM IST
Parabhava nama samvatsara ugadi panchangam 2026 kanya rasi phalalu virgo horoscope
Kanya Rasi Phalalu 2026 : కన్య రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయంటున్నారు పండితులు. సప్తమ శని ప్రభావం వల్ల నమ్మిన వాళ్లే మోసం చేస్తారని హెచ్చరిస్తున్నారు. అందుకే స్నేహాలు, ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ ఏడాదిలో కన్య రాశి వారిపై నిందలు రావడం, ఫేక్ న్యూస్ ప్రచారం అవ్వడం జరుగుతాయని.. కానీ భయపడకుండా ఉంటేనే బయటపడతారని చెబుతున్నారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు. కన్య రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుందన్నారు. అయితే అవమానాలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం అంటున్నారు.
ఆదాయం: 14 వ్యయం: 8 రాజపూజ్యం: 1 అవమానం: 7
జూన్ వరకు జాగ్రత్తలు: కన్య రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు గురువు 10వ స్థానంలో ఉంటాడు. కనుక ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవద్దంటున్నారు. అలానే ఎటువంటి అగ్రీమెంట్లు లేదా కొనుగోళ్లు చేయకూడదు.
అదృష్ట సమయం (జూన్ – అక్టోబర్): కన్య రాశి వారికి 2026 జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురువు 11వ స్థానంలోకి రావడం వల్ల అదృష్ట సమయం ప్రారంభం అవుతుందంటున్నారు. ఈ సమయంలో ఏ పెట్టుబడి పెట్టినా, ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందని చెబుతున్నారు.
అక్టోబర్ 31 – జనవరి 24: గురువు 12వ స్థానంలోకి వెళ్లడం వల్ల ఖర్చులు పెరగడమే కాక ఆరోపణలు, నిందలు మోపుతారని.. ఇలాంటి సమయంలో భయాన్ని వదిలేసి, ధైర్యంగా ఉండాలన్నారు.
ముఖ్యమైన పరిహారాలు:
- రెండు యాగాలు: అక్షయ తృతీయ, ధనత్రయోదశి నాడు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవాలి.
- ఆలయ దర్శనం: గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలి. కుదరకపోతే ఆలంపూర్ జోగులాంబ, కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడం శ్రేయస్కరం అంటున్నారు.
- మయూర మాల: శని గ్రహ పీడ తగ్గించుకోవడానికి కన్య రాశి వారు మయూర మాలను ధరించాలని సూచిస్తున్నారు.
దైవారాధన:
- ప్రతి మంగళవారం గణపతిని దర్శించుకోవాలి.
- ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
