Raj Yogas in June : జూన్ నెలలో 4 అద్భుతమైన యోగాలు.. ఈ 5 రాశుల వారి పంట పండింది పో.. అప్పులన్నీ తీరతాయి.. వద్దన్నా డబ్బు..!
Raj Yogas in June : జూన్ నెలలో అరుదైన 4 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని వల్ల ఐదు రాశుల వారి జీవితం సమూలంగా మారబోతుంది.
- Dharani Pilli
- Updated on- May 25, 2026 / 06:04 PM IST
Raj yogas in June 2026 jackpot for these 5 zodiac signs Debts will be cleared money will pour in
Raj Yogas in June : గ్రహాలు, సూర్య, చంద్రుల గమనం వల్ల మనుషుల జీవితాల మీద చాలా ప్రభావం ఉంటుంది. ఈ గ్రహ గమనాలు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తాయి. ఈ క్రమంలో జ్యోతిష్యపరంగా జూన్ మాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ జూన్ నెలలో ఏకకాలంలో పలు గ్రహ గమనాల్లో మార్పులు జరగబోతున్నాయి. అందువల్ల జూన్ నెలలో 4 అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ నాలుగు యోగాల వల్ల 5 రాశుల వారు అద్భుతమైన ఫలితాలు పొందనున్నారు. వారి జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశుల వారు ఇన్నాళ్లు అనుభవించిన కష్టాలు, నష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోబోతున్నాయి. ఇంతకూ జూన్ నెలలో ఏర్పడే యోగాలు ఏవి.. వాటి వల్ల ఏ ఏ రాశుల వారికి ప్రయోజనం కలగనుంది అంటే…
జూన్ నెలలో గురు, శుక్ర, సూర్య, కుజ, బుధ గ్రహాలన్నీ తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహ గమనాల కారణంగా.. జూన్‌లో ‘గజలక్ష్మి యోగం’, ‘రుచక రాజయోగం’, ‘హంస రాజయోగం’, ‘బుధాదిత్య యోగం’ అనే నాలుగు ప్రధాన రాజయోగాలు ఏర్పడబోతున్నాయని పండితులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగాల ప్రభావం వల్ల 5 రాశుల వారు అద్భుతమైన ఫలితాలు చవిచూడబోతున్నారని పండితులు వివరిస్తున్నారు.
జూన్ నెలలో ఏర్పడబోయే నాలుగు యోగాలు.. అవి ఎందువల్ల ఏర్పడుతున్నాయి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే..
- హంస రాజయోగం: ఇది గురు గ్రహం (బృహస్పతి) వల్ల ఏర్పడుతుంది. ఈ యోగం జ్ఞానం, సంపద, విజయాన్ని అందిస్తుంది.
- గజకేసరి / గజలక్ష్మి యోగం: గురుడు, చంద్రుని శుభప్రదమైన కలయిక/దృష్టి వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సంపద, అదృష్టాన్ని తీసుకువస్తుంది.
- రుచక యోగం: ఇది కుజ గ్రహం (అంగారకుడు) వల్ల ఏర్పడుతుంది. ఈ యోగం ధైర్యం, నాయకత్వ లక్షణాలతో పాటు భూమి/ఆస్తి లాభాలను చేకూరుస్తుంది.
- బుధాదిత్య యోగం: సూర్యుడు మరియు బుధ గ్రహాల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది కెరీర్ వృద్ధికి, తెలివితేటలకు ఎంతో అనుకూలమైనది.
లబ్ధి పొందే రాశులు
జూన్ నెలలో ఏర్పడే నాలుగు రాజయోగాల వల్ల 5 రాశుల వారు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. ఇంతకూ ఆ 5 రాశులు ఏవంటే:
మేష రాశి:
జూన్ నెలలో ఏర్పడే రుచక రాజయోగం ప్రభావం వల్ల మేష రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉండబోతోంది అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ఈ రుచక యోగం వల్ల మేష రాశి వారు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా మధ్యలో ఆగిపోయిన పనులు కూడా ఈ నెలలో చాలా త్వరగా పూర్తవుతాయి. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది.. అప్పుల బాధలు అన్నీ తీరతాయి.
మిథున రాశి:
జూన్ నెలలో బుధాదిత్య యోగం ప్రభావం వల్ల మిథున రాశి వారి జీవితంలో ఇన్నాళ్లు ఎదుర్కొన్న చెడు రోజులు ముగిసిపోయి.. మంచి కాలం ప్రారంభం అవుతుంది అంటున్నారు పండితులు. జూన్ నుంచి వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని.. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. డబ్బు విషయంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుందంటున్నారు పండితులు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి:
గురు అనుగ్రహం, హంస రాజయోగ నిర్మాణాల వల్ల కర్కాటక రాశి వారికి గడ్డుకాలం తొలగిపోతుంది అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా జూన్ నెలలో కర్కాటక రాశి మహిళలకు చాలా అద్భుతంగా ఉంటుందంటున్నారు. చాలా రోజులుగా అప్పుల బాధతో సతమతమవుతున్న కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఈ అప్పుల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని.. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయంటున్నారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుందని.. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం జరుగుతుందంటున్నారు. అలాగే ఈ మాసం విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మకర రాశి:
జూన్ నెలలో మకర రాశి వారిపై.. గురు, శుక్ర గ్రహాల కలయికతో పాటు బలమైన గజలక్ష్మి యోగ ప్రభావం ఉండనుంది. ఫలితంగా మకర రాశి వారికి జూన్ నెల చాలా లాభదాయకంగా ఉండబోతోంది అంటున్నారు. జూన్ నెలలో మకర రాశి వారు వ్యాపారపరంగా దూసుకెళ్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలు వస్తాయని చెబుతున్నారు. దీంతో చేతినిండా డబ్బుతో.. కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా గడుపుతారని… ఇంటిలోనే కాక బయట కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
మీన రాశి:
జూన్ నెలలో ఏర్పడే నాలుగు రాజయోగాల వల్ల మీన రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి అంటున్నారు పండితులు. ఈ రాజయోగాల వల్ల మీన రాశి వారు జూన్ నెల మొత్తం చాలా జాలీగా గడిపేస్తూ ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
