2026 Hyundai Verna : వావ్.. ప్రీమియం లుక్స్‌ కేక.. కొత్త హ్యుందాయ్ వెర్నా వచ్చేసిందోచ్.. ధర రూ. 10.98 లక్షలే.. ఫుల్ డిటెయిల్స్

2026 Hyundai Verna : హ్యుందాయ్ కొత్త వెర్నా లాంచ్ అయింది. డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో ఇతర కార్లతో పోటీగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyundai Verna

  • భారత మార్కెట్లో 2026 హ్యుందాయ్ వెర్నా లాంచ్
  • హ్యుందాయ్ వెర్నా ప్రారంభ ధర రూ. 10.98 లక్షలు
  • వోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీతో పోటీగా వెర్నా మోడల్

2026 Hyundai Verna : హ్యుందాయ్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే న్యూస్.. హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి సరికొత్త వెర్నా కారు వచ్చేసింది. భారత మార్కెట్లో ధర రూ. 10.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లాంచ్ అయింది.

డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీతో పాటు 25కి పైగా లేటెస్ట్ ఫీచర్ అప్‌డేట్స్ అందిస్తుంది. మిడ్-సైజ్ కేటగిరీలో హ్యుందాయ్ కొత్త వెర్నా మోడల్ ప్రీమియం, యూత్‌ఫుల్ స్టైలింగ్ అందిస్తుంది. మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ వంటి కార్లతో నేరుగా పోటీపడుతుంది.

డిజైన్ అప్‌డేట్స్ :
2026 హ్యుందాయ్ వెర్నాలో బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, రీడిజైన్ బంపర్లు, R16 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 4,565mm పొడవు, 1,765mm వెడల్పు, 2,670mm వీల్‌బేస్‌ సహా క్యాబిన్ స్పేస్ అందిస్తుంది.

ఇంటీరియర్, ఫీచర్లు :
హ్యుందాయ్ ఇంటీరియర్ లగ్జరీగా ఉంటుంది. క్యాబిన్‌లో డీ-కట్ స్టీరింగ్ వీల్, లెథరెట్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసే సీట్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం మెమరీ ఫంక్షన్‌తో 8-వే, ఫ్రంట్ ఫ్యాసింజర్లకు 4-వే, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లలో రియర్ విండో సన్‌షేడ్, ప్యాసింజర్ సీట్ వాక్-ఇన్ డివైస్, 528 లీటర్ల స్టోరేజీ కెపాసిటీతో స్మార్ట్ ట్రంక్ ఉన్నాయి. డ్యూయల్ 10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ స్క్రీన్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ 4G డేటా, మరెన్నో డేటా బెనిఫిట్స్

హ్యుందాయ్ బ్లూలింక్ సపోర్టు ఇస్తుంది. 70కి పైగా కనెక్ట్ ఫీచర్‌లు, 350కి పైగా వాయిస్ కమాండ్‌ అందిస్తుంది. యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

కొత్త హ్యుందాయ్ వెర్నా భారీ డ్యూయల్-స్క్రీన్ సెటప్‌తో వస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బోస్ నుంచి ప్రీమియం 8-స్పీకర్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోల్ కోసం స్విచ్ ఇంటర్‌ఫేస్‌, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ డ్రైవర్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు :
హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 అడాస్, 20 ఫీచర్లు, సెంటర్ ఎయిర్‌బ్యాగ్‌తో సహా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, సెగ్మెంట్-ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్‌తో సేఫ్టీ అందిస్తుంది. ఇందులో 75కి పైగా అడ్వాన్స్ ఫీచర్లతో పాటు 35 స్టాండర్డ్ టెక్నాలజీ ఆప్షన్లను అందిస్తుంది.

ఇంజిన్ ఆప్షన్లు :
రెండు పెట్రోల్ ఇంజిన్లలో ఎంచుకోవచ్చు. 1.5-లీటర్ MPi ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ IVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 1.5-లీటర్ టర్బో GDi ఇంజిన్ 160hp, 253Nm జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.