Post Office FD : మీకు పోస్టాఫీసులో FD ఉందా? 365 రోజుల ఖాతాపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!
Post Office FD : పోస్టాఫీసులో 365 రోజుల FDపై భారీ మొత్తంలో వడ్డీని సంపాదించుకోవచ్చు. పోస్టాఫీస్ FD ఖాతాలకు 6.90 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీని అందిస్తాయి. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 13, 2026 / 07:51 PM IST
Post Office FD
- మీకు పోస్టాఫీసులో FD అకౌంట్ ఉందా?
- 365 రోజుల ఎఫ్ డీ ఖాతాలపై వడ్డీ ఎంతంటే?
- ఏడాది FD పథకాలపై 6.90 శాతం వడ్డీ రేటు
Post Office FD : పోస్టాఫీసులో FD చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటినుంచే పోస్టాఫీసులో కొంత డబ్బును ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. పోస్టాఫీసుల్లో పోస్టాఫీసు సేవలతో పాటు అనేక రకాల బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అనేక రకాల సేవింగ్స్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ కూడా చాలా పాపులర్ పొందాయి. దేశంలోని అధిక శాతం ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే.. కస్టమర్ల డబ్బు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రొటెక్ట్ అవుతుంది. పోస్టాఫీసులో 365 ఏళ్ల ఎఫ్ డీపై ఎంత వడ్డీ వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టాఫీసులో 365 రోజుల FDపై వడ్డీ ఎంతంటే? :
బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాలను అందిస్తాయి. అయితే, పోస్టాఫీసులు ఎఫ్‌డీ ఖాతాలను టైమ్ డిపాజిట్ అనే పేరుతో అందిస్తాయి. టైమ్ డిపాజిట్ పథకం బ్యాంకు ఎఫ్‌డీ పథకాల మాదిరిగానే ఉంటుంది.
Read Also : OPPO A7 Pro 5G : వారెవ్వా.. ఈ ఒప్పో 5G ఫోన్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?
మీరు కేవలం ఒకసారి డబ్బు డిపాజిట్ చేస్తే చాలు.. మెచ్యూరిటీ కాగానే మీ పూర్తి మొత్తాన్ని స్థిర వడ్డీతో పాటు తిరిగి పొందవచ్చు. పోస్టాఫీసులు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలపరిమితితో ఫిక్స్ డ్ డిపాజిట్లను అందిస్తాయి.
గరిష్టంగా పెట్టుబడి ఎంతంటే? :
పోస్టాఫీస్ తమ కస్టమర్లకు 365 రోజులు, ఒక ఏడాది FD పథకాలపై 6.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పోస్టాఫీస్‌లో వివిధ కాలపరిమితులతో ఎఫ్‌డీ ఖాతాలు 6.90 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. 5 ఏళ్ల ఎఫ్‌డీ ఖాతాలపై వినియోగదారులు అత్యధికంగా 7.50 శాతం వడ్డీ రేటును పొందుతారు. పోస్టాఫీస్ ఎఫ్‌డీ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. మీరు కోరుకున్నంత డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఏంటి? :
పోస్టాఫీసు అనేది అన్ని వయస్సుల వారికి సమాన వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే, సాధారణ కస్టమర్లతో పోలిస్తే 60 ఏళ్లు పైబడిన కస్టమర్లకు అధిక వడ్డీని అందిస్తాయి. అంతేకాదు.. అనేక బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కన్నా 80 ఏళ్లు పైబడిన కస్టమర్లకు అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.
