Best Budget Cars
Best Budget Cars : సొంత కారు ప్రతిఒక్కరి కల. కొత్త కారు కొనాలని అందరూ కోరుకుంటారు. కానీ, కొంతమంది మాత్రమే కారు కొనగలరు. అందులోనూ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కారు కొనాలంటే కష్టమే. చేతిలో డబ్బులు పెట్టుకోవాలి. మీరు కూడా కొత్త కారు కొనాలని చూస్తున్నారా?
అయితే ఇది మీకోసమే. అయితే, చాలామందికి ఏ కారు కొనాలో తెలియదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈఎంఐలపై కార్లను కొనుగోలు చేసే వారు మాత్రం తప్పనిసరిగా బడ్జెట్ చూసుకోవాలి.
ఎందుకంటే కారు కొంటే ఈఎంఐల ద్వారా నెలవారీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కారు కొనుగోలు చేసేటప్పుడు మీ బడ్జెట్, నెలవారీ జీతం కూడా లెక్కేయాలి. మీ బడ్జెట్‌కు మించి ఖరీదైన కారు కొంటే అదనపు ఖర్చుతో పాటు మెయింట్ నెన్స్ కూడా భారీగా పెరుగుతుంది. రానురాను మీ బడ్జెట్‌పై అదనపు భారం పడుతుంది.
అందుకే మీరు కారు కొంటే మీ బడ్జెట్‌లోనే కొనడం బెటర్. రూ. 40,000 నుంచి రూ. 50,000 జీతం సంపాదించే వ్యక్తి కారు కొనేందుకు మార్కెట్లో అద్భుతమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మీకోసం టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన కారు ఎంచుకుని కొనేసుకోండి.
టాటా పంచ్ :
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి వచ్చిన టాటా పంచ్ SUV మోడల్ మీ బడ్జెట్‌లోనే కొనేసుకోవచ్చు. టాటా పంచ్ SUV ధర రూ. 5.59 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. ఈ కారు CNG ఆప్షన్ కూడా అందిస్తుంది. ఫీచర్లు మాత్రం కిర్రాక్ ఉంటాయి.
నిస్సాన్ మాగ్నైట్ :
నిస్సాన్ మాగ్నైట్ SUV కూడా అద్భుతమైన కారు. ఈ సరసమైన నిస్సాన్ మాగ్నైట్ కారు ధర రూ. 5.61 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు వైడ్ రేంజ్ ఫీచర్లతో అత్యంత ఆకట్టుకునేలా ఉంది.
స్కోడా కైలాక్ :
స్కోడా క్యాలాక్ అనేది మీరు కొనుగోలు చేసే మరో స్టైలిష్, బడ్జెట్-ఫ్రెండ్లీ SUV మోడల్ కారు. ఈ SUV వైడ్ రేంజ్ ఫీచర్లను అందిస్తుంది. స్కోడా క్యాలాక్ ధర రూ. 7.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ :
మారుతి సుజుకి కారు కొనాలని చూస్తుంటే మారుతి సుజుకి ఫ్రాక్స్‌ను కొనేసుకోవచ్చు. మారుతి సుజుకి ఫ్రాక్స్ రూ. 6.84 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
కియా సైరోస్ :
కియా సిరియస్ SUV కారు ధర రూ. 8.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మీరు కొనాలని అనుకుంటే ఈ కారు కూడా కొనేసుకోవచ్చు.