×
Ad

5 Best Phones : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా కిర్రాక్ ఫీచర్లతో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఏది కొంటారో కొనేసుకోండి!

5 Best Phones : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కావాలా? అంతకన్నా బెటర్ ఫీచర్లతో మార్కెట్లో 5 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి..

1/7
5 Best Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా అద్భుతమైన ఫీచర్లతో అనేక ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అదిరిపోయే పర్ఫార్మెన్స్, డిజైన్, కెమెరా క్వాలిటీతో అత్యంత ఆకర్షణగా ఉన్నాయి.
2/7
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ నుంచి వివో X200 ప్రో వరకు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా 2025లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
3/7
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (రూ. 1,34,990) : ఐఫోన్ 17 ప్రో మాక్స్ 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A19 ప్రో చిప్‌ కలిగి ఉంది. 4x ఆప్టికల్ జూమ్, LiDAR సెన్సార్, 8K డాల్బీ విజన్ వీడియో క్యాప్చర్‌తో ట్రిపుల్ 48MP బ్యాక్ కెమెరాలు మొబైల్ ఫోటోగ్రఫీని అందిస్తాయి. 2025లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా అద్భుతమైన ఫ్లాగ్‌షిప్‌ అని చెప్పొచ్చు.
4/7
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,24,999) : ఈ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్ 6.8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం టెన్సర్ G5 ప్రాసెసర్ ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP మెయిన్, 48MP పెరిస్కోప్, 48MP అల్ట్రా-వైడ్, 42MP ఫ్రంట్ కెమెరాతో పాటు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా బెటర్ ఫీచర్లతో ఎంచుకోవచ్చు.
5/7
వివో X200 ప్రో (రూ. 94,999) : వివో X200 ప్రో ఫోన్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. 8K వీడియో సపోర్ట్‌తో 200MP టెలిఫోటో లెన్స్‌తో అడ్వాన్స్కెమెరా సెటప్ ప్రొఫెషనల్-గ్రేడ్ రిజల్ట్స్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా అద్భుతమైన పోటీదారుగా నిలిచింది.
6/7
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 86,999) : ఒప్పో పైండ్ X8 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌, HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్ ట్యూన్ 50MP క్వాడ్ కెమెరాలు, డైమెన్సిటీ 9400 చిప్, 5910mAh బ్యాటరీతో వస్తుంది. 2025లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా స్టైలిష్, పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ అని చెప్పొచ్చు.
7/7
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) : షావోమీ 15 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ QHD+ డిస్‌ప్లే కలిగి ఉంది. 200MP పెరిస్కోప్ లెన్స్, లైకా-ఇంజనీరింగ్ క్వాడ్ కెమెరా సిస్టమ్ వంటి వివరాలను అందిస్తుంది. 5410mAh బ్యాటరీ, 4K సెల్ఫీ వీడియోతో అద్భుతంగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా షావోమీ 15 అల్ట్రా ఫోన్ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.