Air Cooler Tips : కొత్త కూలర్ కొనేముందు అందరూ చేసే 5 పెద్ద మిస్టేక్స్ ఇవే! మర్చిపోతే మీకే నష్టం..!
Air Cooler : ఏసీలతో పాటు, వేసవిలో కూలర్లను తెగ కొనేస్తున్నారు. కొత్త కూలర్ కొనేటప్పుడు మీరు కొన్ని విషయాల గురించి తప్పక తెలుసుకోండి. లేదంటే భవిష్యత్తులో మీరు బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు..
- Sreehari A
- Published on- May 23, 2026 / 03:05 PM IST
Air Cooler Tips
- ఈ సమ్మర్ సీజన్‌లో కొత్త కూలర్ కొంటున్నారా?
- కూలర్ కొనే ముందు ఇవి అసలు మర్చిపోవద్దు
- గది సైజుతో సంబంధం లేకుండా ఏసీ, కూలర్లు కొనొద్దు
Air Cooler Tips : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి.. ఈ వేసవిలో కొత్త ఏసీ కొనాలంటే మీ బడ్జెట్‌లో రాదు.. అయితే, కొత్త కూలర్ కొనాలని చూస్తున్నారా? అయితే, ముందుగా ఏసీ కన్నా తక్కువ ధరలో వస్తుంది కదా అని ఏది పడితే అది తీసుకోవద్దు. కొత్త కూలర్ కొనే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చాలా మంది కూలర్లు కొనేటప్పుడు తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
ఆ తర్వాత అనవసరం కొన్నామంటూ తెగ బాధపడుతుంటారు. పైగా ఆ కూలర్ ఇంట్లో ఎంతసేపు ఆన్ చేసి ఉంచినా గదిని సరిగ్గా కూలింగ్ అవ్వదు. ప్రస్తుతం మార్కెట్లో అవుట్‌డోర్, ఇన్‌డోర్ కూలర్లతో సహా అనేక రకాల కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూలర్లు వివిధ సైజులలో లభిస్తాయి. కూలర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. గది పరిమాణం ఆధారంగా కూలర్ :
మీ ఇంటి గది పరిమాణాన్ని బట్టి ఏసీ లేదా కూలర్‌ను కొనుగోలు చేయాలి. మీ పెద్ద గది కోసం 30 లీటర్ల నుంచి 50 లీటర్ల ట్యాంక్ ఉన్న చిన్న కూలర్‌ను కొనుగోలు చేస్తే ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. మీ గది కూలింగ్ అవ్వదు. అదే మిడ్ రేంజ్ రూమ్ కూలింగ్ కోసం మీకు 70 లీటర్ల నుంచి 80 లీటర్ల ట్యాంక్ ఉన్న కూలర్ అవసరం. ఈ కూలర్ మిడియం పరిమాణం ఉండే గదిని పూర్తిగా కూలింగ్ చేస్తుంది.
ఎయిర్ ఫ్లో :
కూలర్ ట్యాంక్ సైజుతో పాటు అందులో వాడే ఫ్యాన్ కూడా చెక్ చేయాలి. ఫ్యాన్ సైజు చిన్నగా ఉంటే ఎయిర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. కూలర్ CFM (క్యూబిక్ ఫీట్ పర్ మీటర్) కూడా తక్కువగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితిలో మీరు కూలర్ ఫ్యాన్ CFMను చెక్ చేయాలి. కేవలం తక్కువ ధర కోసమో తక్కువ CFM ఉన్న కూలర్‌ను ఎప్పుడూ కొనవద్దు. ఇలాంటి పరిస్థితిలో మీకు కూలర్ గాలి మాత్రమే వస్తుంది. కానీ, కూలింగ్ అనిపించదు.
కూలింగ్ ప్యాడ్ :
ఈ రోజుల్లో, కూలర్లలో హానీ కూలింగ్ ఫ్యాడ్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇండోర్ కూలర్ల కోసం మీరు సాధారణంగా హానీ ప్యాడ్ మోడల్‌ను ఎంచుకోవాలి. ఈ తరహా ప్యాడ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఎయిర్ ఫ్లో ఫాస్ట్ ఉంటుంది. అదే గడ్డి కూలర్లలో మాత్రం మీరు ప్రతి ఏడాది గడ్డిని మార్చాలసి ఉంటుంది. అంతేకాదు.. ఎయిర్ ఫ్లోకు అడ్డంకిగా కూడా అదే గడ్డి మారవచ్చు.
గదిలో ఎయిర్ ఫ్లో సరిగ్గా ఉండాలి :
మీ కూలర్‌ను పెట్టే గదిలో సరైన వెంటిలేషన్ ఉండాలి. గదిలో గాలి బయటకు వెళ్లేలా ఉండాలి. లేదంటే మీ కూలర్ కూలింగ్ ఇవ్వదు. కూలర్ ఎన్ని గంటలు రన్ చేసినా గది కూలింగ్ అసలు అవ్వదు.
మీ కూలర్‌ను ఎల్లప్పుడూ సరైన వెంటిలేషన్ ఉన్న గదిలోనే పెట్టుకోవడం బెటర్. బయటి గాలి లోపలికి.. లోపలి వేడి గాలి బయటకు వెళ్లేందుకు వీలుంటుంది. కూలర్ కాసేపు ఆన్ చేసినా గది వెంటనే కూలింగ్ అవుతుంది.
