Summer AC Tips : మీ ఇంట్లో AC కూలింగ్ సమస్యా? మెకానిక్‌తో పనిలేదు.. ఈ 5 సింపుల్ ట్రిక్స్ చాలూ!

Summer AC Tips : కొత్త ఏసీ కొనాలని అనుకుంటున్నారా? మీ ఇంటి గది పరిమాణం ఎంత? గదిని బట్టి ఏసీని తీసుకోవాలి. లేదంటే ఆ గదిని కూలింగ్ చేయలేదు. ఈ టిప్స్ ఓసారి ట్రై చేయండి..

Summer AC Tips

  • మీ రూమ్ సైజుకు తగిన ఏసీని ఎంచుకోండి.
  • వేసవికి ముందే ఏసీని టెక్నీషియన్‌తో చెక్ చేయించుకోవాలి
  • ప్రతి 3 నుంచి 4 నెలలకు సర్వీసింగ్ చేయించడం మంచిది
  • వారానికి ఫిల్టర్లు క్లీనింగ్ చేస్తే కూలింగ్ సామర్థ్యం పెరుగుతుంది

Summer AC Tips : వేసవి వచ్చేసింది.. ఎండలు దంచికొడుతున్నాయి. వేడి నుంచి రిలీఫ్ కోసం చాలా మంది ఎయిర్ కండిషనర్లపై ఆధారపడుతుంటారు. ఇంటికి వచ్చాక ఏసీ ఆన్ చేయగానే రూమ్ కూలింగ్ కాకుంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఎక్కువ సమయం ఏసీ ఆన్ చేసినా కూడా గది కూలింగ్ కావడం లేదని అంటుంటారు.

ఏసీని సరైన పద్ధతిలో వాడకపోవడం లేదా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే సరైన ఏసీ సైజును ఎంచుకోవడం నుంచి క్రమం తప్పకుండా మెయింటైనెన్స్ చేయడం వరకు చిన్న మార్పులతో ఏసీ కూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.. ఇంట్లో ఏసీని వేగంగా కూలింగ్ చేసే అద్భుతమైన టిప్స్ ఓసారి ట్రై చేయండి..

మీ ఏసీని వేగంగా కూలింగ్ చేసే చిట్కాలివే :

  • మీ గది సైజుకు తగిన ఏసీని ఎంచుకోండి
  • ప్రతి ఎయిర్ కండిషనర్ ప్రతి గదికి సరిపోదు.
  • మీ గది సైజు అవసరమైన కూలింగ్ సామర్థ్యం ఉండాలి.
  • ఏసీ సామర్థ్యాన్ని టన్నులలో కొలుస్తారు.

ఉదాహరణకు.. సుమారు 80 చదరపు అడుగుల వరకు ఉన్న గదికి ఏసీ 0.8-టన్నుల సామర్థ్యం సరిపోతుంది. అయితే 100 చదరపు అడుగుల వరకు ఉన్న గదులకు 1-టన్ ఏసీ అవసరం కావచ్చు. సుమారు 150 చదరపు అడుగుల పెద్ద గదులకు సాధారణంగా 1.5-టన్నుల యూనిట్లు అవసరం. 200 చదరపు అడుగుల వరకు ఉన్న ప్రదేశాలకు 2-టన్నుల ఏసీ అవసరం కావచ్చు. ఒకవేళ ఏసీ గదికి సరిపోనంత చిన్నదిగా ఉంటే అది ఆ ప్రదేశాన్ని కూలింగ్ చేయలేదు.

Read Also : Jio vs Airtel : జియో vs ఎయిర్‌టెల్.. ఒకే రూ. 899 ప్లాన్.. వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్.. ఎందులో బెటర్? ఫుల్ డిటెయిల్స్!

మీ ఏసీకి క్రమంతప్పకుండా సర్వీస్ చేయించండి :
కాలక్రమేణా, ఏసీని చాలా నెలల పాటు వాడకుండా వదిలేస్తే అవుట్‌డోర్ యూనిట్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. సర్వీసింగ్ చేస్తే ఆ పేరుకుపోయిన మలినాలను తొలగిపోయి సిస్టమ్ సాఫీగా వర్క్ అవుతుంది. వేసవి ప్రారంభానికి ముందే ఏసీని టెక్నీషియన్‌తో చెక్ చేయించుకోవడం బెటర్. ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది.

ఎయిర్ ఫిల్టర్లను తరచూ క్లీన్ చేయండి :
మీ గదిలో దుమ్ము, ఇతర కణాలు లేకుండా నిరోధించేలా ఎయిర్ ఫిల్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, కాలక్రమేణా ఈ ఫిల్టర్లలో మురికి పేరుకుపోతుంది. ఫిల్టర్లు మూసుకుపోయినప్పుడు ఎయిర్ ఫ్లో తగ్గి, కూలింగ్ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. ప్రతి కొన్ని వారాలకు ఫిల్టర్లను క్లీన్ చేస్తుండాలి. అప్పుడు కూలింగ్ సామర్థ్యం మెరుగుపడుతుంది విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో కూడా సాయపడుతుంది.

సరైన టెంపరేచర్ సెట్ చేయండి :
ఏసీని చాలా తక్కువ టెంపరేచర్ వద్ద రన్ చేస్తే గది తొందరగా కూల్ అవుతుందని చెప్పలేం. పైగా, అది పవర్ వినియోగాన్ని పెంచుతుంది. టెంపరేచర్ సుమారు 24–25°C వద్ద ఉంచడం మంచిది.

ఔట్ డోర్ యూనిట్‌ ప్రొటెక్ట్ చేయండి :
ఔట్ డోర్ యూనిట్ వేడిని తట్టుకునేలా ఉంటుంది. కానీ, దానిపై ఒక ప్రొటెక్షన్ షేడ్‌ను ఉంచడం బెటర్. ఏదైనా షేడ్ యూనిట్‌ను నేరుగా సూర్యరశ్మి, పక్షుల రెట్టలు ఇతర వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే, ఆ షేడ్ యూనిట్ చుట్టూ ఎయిర్ ప్లోకు అడ్డుపడకుండా ఉండేలా చూడాలి.