×
Ad

Android Camera Phones : కొత్త ఐఫోన్ 17 కొనడం కన్నా ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు బెటర్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 కన్నా అదిరిపోయే ఫీచర్లు కలిగిన టాప్ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఇందులో ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

1/7
Android Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, ఏ ఫోన్ కొనాలో అర్థం కావడం లేదా? 2025లో ఫ్లాగ్‌షిప్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు అనేక బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. ఐఫోన్ 17కు పోటీగా మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. షావోమీ లైకా-ఆధారిత లెన్స్ నుంచి శాంసంగ్ 200MP బీస్ట్ వరకు అద్భుతమైన ఫొటో క్వాలిటీ, పవర్‌ఫుల్ జూమ్, ప్రొఫెషనల్-గ్రేడ్ వీడియోగ్రఫీని అందిస్తున్నాయి. ఐఫోన్ 17 కన్నా మించిన కెమెరా ఫీచర్లతో మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 17 కొనే బదులుగా ఈ ఆండ్రాయిడ్ 6 కెమెరా ఫోన్లలో ఏదైనా ఇకటి కొనేసుకోవచ్చు.
2/7
గూగుల్ పిక్సెల్ 10 (రూ. 79,999) : గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 48MP వైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో లెన్స్, 13MP అల్ట్రావైడ్ షూటర్‌తో వస్తుంది. 4K వీడియో, అల్ట్రా-HDR, ఏఐ ఇమేజింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. కొత్త ఐఫోన్ 17 కన్నా స్ట్రాంగ్ కెమెరా ఫోన్‌గా నిలిచింది.
3/7
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) : షావోమీ 15 అల్ట్రాలో ఒక అంగుళాల 50MP ప్రైమరీ సెన్సార్, 4.3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. లైకాతో ఇంజనీరింగ్ 8K వీడియో, 120fps వద్ద 4K, 32MP 4K సెల్ఫీ కెమెరాకు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన కెమెరా ఫోన్‌గా నిలిచింది.
4/7
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (రూ. 79,999) : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 200MP మెయిన్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 10MP 3x టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌ అందిస్తుంది. HDR10+, 8K రికార్డింగ్, లేజర్ ఏఎఫ్‌తో పాటు ప్రో-లెవల్ ఫొటోగ్రఫీని అందిస్తుంది. 2025లో ఐఫోన్ 17 కన్నా బెటర్ ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు.
5/7
వివో X200 (రూ. 65,999) : వివో X200లో OISతో కూడిన ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, 3x టెలిఫోటో లెన్స్, షార్ప్, బ్యాలెన్స్డ్ షాట్స్ కోసం అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. జీఈఐఎస్ఎస్ ఆప్టిక్స్, 32MP 4K సెల్ఫీ కెమెరా సపోర్టుతో ప్రీమియం ఇమేజింగ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 17కు మించిన అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగి ఉంది.
6/7
ఒప్పో ఫైండ్ X8 (రూ. 68,999) : ఒప్పో ఫైండ్ X8లో ట్రిపుల్ 50MP హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో వైడ్, 3x పెరిస్కోప్, అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. డాల్బీ విజన్ 4K రికార్డింగ్, 32MP 4K సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సినిమాటిక్ విజువల్స్‌ అందిస్తుంది. ఐఫోన్ 17 కన్నా టాప్ కెమెరా ఫోన్‌గా నిలిచింది.
7/7
వన్‌ప్లస్ 13 (రూ. 63,998) : వన్‌ప్లస్ 13 ఫోన్ హాసిల్‌బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ 50MP కెమెరాలు, 8కె వీడియో సపోర్ట్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ కలిగి ఉంది.