Best Window AC : బాబోయ్ ఏప్రిల్ అంతా ఎండలే.. రూ. 40వేల లోపు బెస్ట్ విండోస్ ఏసీలు.. ఏది కొంటారంటే?

Best Window AC : వచ్చేదంతా వేసవినే.. ఎండలు మాత్రం దంచికొడతాయి. ఉక్కపోత తట్టుకోవాలంటే ఇంట్లో మంచి ఏసీ ఉండాల్సిందే.. కొత్త విండో ఏసీ కోసం చూస్తుంటే రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ విండోస్ ఏసీలు మీకోసం..

Best Window AC

  • వచ్చే ఏప్రిల్ ఎండలు ఎక్కువ.. ఇంట్లో ఏసీ తప్పనిసరి
  • మంచి విండో ఏసీలు తీసుకోవడం బెటర్
  • రూ. 45వేల లోపు ధరలో 6 బెస్ట్ విండో ఏసీలు మీకోసం

Best Window AC : ఈ సమ్మర్‌లో మంచి విండో ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 40వేల బడ్జెట్ లోపు ధరలో ఈ ఏడాదిలో మార్కెట్లో అద్భుతమైన విండో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. హై క్వాలిటీతో ఏసీలు కొనే బదులుగా మీ ఇంటి గదులకు సరిపోయేలా ఈ విండో ఏసీలను కొనేసుకోవడం బెటర్.

మీ బడ్జెట్ ధరలో సరసమైన ధరకే లభిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లు మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో కొనుగోలు చేయాల్సిన 6 బెస్ట్ విండో ఏసీలను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన విండో ఏసీని కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

హైయర్ 2025 మోడల్ 1.5 (రూ. 30,990) :
హైయర్ విండో ఏసీ టర్బో జెట్ కూలింగ్ టెక్నాలజీతో 1.5 టన్ల టెక్నాలజీని అందిస్తుంది. ఈ యూనిట్ 111 నుంచి 150 చదరపు అడుగుల వరకు ఉన్న గదులకు బాగా సరిపోతుంది. ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ యూనిట్‌లో R32 రిఫ్రిజెరెంట్, డైనమిక్ కూలింగ్, అత్యంత సైలెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. వార్షిక వినియోగం దాదాపు 1192.12W ఉంటుంది.

బ్లూస్టార్ 1.5 టన్ 3 స్టార్ (రూ. 30,990) :
బ్లూస్టార్ విండో ఏసీ 1.5 టన్నుల సామర్థ్యంతో, 3.15 ISEER వాల్యూతో వస్తుంది. ఇందులో 2D స్వింగ్, డస్ట్ ఫిల్టర్లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ యూనిట్ మొత్తం 1525 వాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. ఈ యూనిట్‌కు 3-స్టార్ రేటింగ్, ఏడాది వారంటీ ఉన్నాయి.

Read Also : FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ బ్రేకింగ్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజు పెంపు.. ఆన్‌లైన్‌లో పాస్ ఎలా తీసుకోవాంటే?

గోద్రెజ్ 1.5 టన్ 5 స్టార్ (రూ. 34,890) :
గోద్రెజ్ ఏసీ 1.5 టన్నుల సామర్థ్యం అందిస్తుంది. 111 నుంచి 150 చదరపు అడుగుల గదులకు అనుకూలంగా ఉంటుంది. 3.55 ISEER వాల్యూ కూడా ఉంది. ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ యూనిట్‌లో యాంటీ-డస్ట్ ఫిల్టర్, స్లీప్ మోడ్, మెమరీ ఫంక్షన్‌తో ఆటో రీస్టార్ట్, స్మార్ట్ డయాగ్నోసిస్ ఉన్నాయి. చివరగా, వార్షిక విద్యుత్ వినియోగం ఏడాదికి 1111.14 యూనిట్లు ఉన్నాయి.

క్యారియర్ 2026 మోడల్ 1.5 టన్ (రూ. 34,990) :
క్యారియర్ ఏసీ 1.5 టన్నుల సామర్థ్యంతో 5-స్టార్ బీఈఈ రేటింగ్‌తో వస్తుంది. 1104.37kWh వార్షిక వినియోగానికి 52°C ఉష్ణోగ్రత అందిస్తుంది. ఈ యూనిట్ 111-150 చదరపు అడుగుల మిడ్ రేంజ్ గదులకు బాగా సరిపోతుంది. 3.55 W/W ISEER వాల్యూ కూడా అందిస్తుంది.

వోల్టాస్ 185V వెర్టిస్ ఎలైట్ A (రూ. 34,950) :
వోల్టాస్ విండో ఏసీ 1.5 టన్నుల సామర్థ్యంతో వస్తుంది. 111 నుంచి 150 చదరపు అడుగుల మధ్య ఉన్న గదులకు అనుకూలంగా ఉంటుంది. ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. సంవత్సరానికి 1114.62kWh విద్యుత్ వినియోగాన్ని అందిస్తుంది. దీనికి 3.51 ISEER వాల్యూ కూడా ఉంది. ఈ యూనిట్‌లో R32 రిఫ్రిజెరెంట్ గ్యాస్, 100శాతం కాపర్ కండెన్సర్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి.

లాయిడ్ 2025 మోడల్ 1.5 టన్ (రూ. 36,899) :
లాయిడ్ విండో ఏసీ 6-ఇన్-1 కన్వర్టిబుల్, ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ యూనిట్‌లో ఇంటర్నల్ వైఫై, డైరెక్ట్ వాయిస్ కమాండ్, స్మార్ట్ 4-వే స్వింగ్, 1.5-టన్నుల సామర్థ్యంతో టర్బో కూలింగ్ కూడా ఉన్నాయి. 111 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో మిడ్ రేంజ్ గదులకు అద్భుతంగా సరిపోతుంది.