FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ బ్రేకింగ్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజు పెంపు.. ఆన్లైన్లో పాస్ ఎలా తీసుకోవాంటే?
FASTag Annual Pass : కొత్త ఆర్థిక సంవత్సరానికి ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల రుసుము పెరగనుంది. ప్రస్తుతం ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000 కాగా, సుమారుగా 2.5శాతం మేర పెరగనుంది.
FASTag Annual Pass
- హైవే ప్రయాణికులకు బిగ్ న్యూస్
- ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజు పెంపు
- రూ. 3వేల నుంచి రూ. 3.075 వరకు
- హైవేపై తరచుగా ప్రయాణించేవారికి బిగ్ రిలీఫ్
FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త వార్షిక పాస్ ధరలు అమల్లోకి రానున్నాయి. మీరు ఎక్కువగా హైవేపై ప్రయాణించేవారు అయితే ఇది మీకోసమే.. నేషనల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) కోసం ఫాస్టాగ్ వార్షిక రుసుము పెంచేసింది. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3వేల నుంచి రూ.3,075కు పెరిగింది.
అంటే.. రూ. 75 పెంపు (సుమారు 2.5శాతం)గా ఉంటుంది. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై క్యాష్ లెస్ జర్నీకి అద్భుతంగా ఉంటుంది. ఈ వార్షిక పాస్ హైవేలపై ఎక్కువ సార్లు ప్రయాణించే వారికి ప్రీపెయిడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వాహనదారులు ఒకేసారి పేమెంట్ చేసి ఎలాంటి అంతరాయం లేకుండా టోల్ నుంచి వెళ్లొచ్చు.
వార్షిక పాస్ వ్యాలిడిటీ వివరాలు :
ఈ వార్షిక పాస్ ఒక ఏడాది పాటు లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ఫస్ట్ ఏది వస్తే అది వ్యాలీడ్ అవుతుంది. 200 ప్రయాణాలు పూర్తి అయ్యాక ఈ పాస్ ఆటోమేటిక్‌గా సాధారణ ఫాస్టాగ్‌గా మారిపోతుంది. అప్పుడు మీరు మళ్లీ రీయాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రుసుము పెంపు స్వల్పమే అయినా హైవేపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.
ఈరోజే పాస్ తీసుకుంటే పాత ధరకే :
వార్షిక టోల్ పాస్ ధర పెరగకముందే కొత్త పాస్ కొనడం చేయడం లేదా రెన్యువల్ చేయడం బెటర్. ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ పాస్ ధరలు అమల్లోకి రానున్నాయి. అంతకన్నా ముందే రెన్యువల్ చేస్తే పాత ధరకే తీసుకోవచ్చు.
అంతేకాదు.. ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేక బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. టోల్ చెల్లింపుల వద్ద అవాంతరాలు ఉండవు. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గుతుంది. తరచుగా ప్రయాణించే వారు భారీగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
ఎవరికి వర్తిస్తుందంటే? :
వార్షిక పాస్‌ను ప్రైవేట్, వాణిజ్య వాహనాలు రెండింటికీ వాడొచ్చు. అయితే, ఈ రేంజ్ లిమిట్ మాత్రమే. దేశవ్యాప్తంగా సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద (జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు) వ్యాలీడ్ అవుతుంది. రాష్ట్ర రహదారులపై లేదా ప్రైవేట్ టోల్ రోడ్లపై పనిచేయదు.
వార్షిక పాస్‌ను రెన్యువల్ ఎలాగంటే? :
- రాజ్మార్గ యాత్ర యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి.
- లేదంటే NHAI వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అవ్వండి.
- ‘Annual Toll Pass’ ఆప్షన్ ఎంచుకుని మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) ఎంటర్ చేయండి.
- UPI/డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 3000 (మార్చి 31 లోగా) చెల్లించండి
- మీరు పేమెంట్ చేసిన సుమారు 2 గంటలలోపు మీ ఫాస్టాగ్ యాక్టివేట్ అవుతుంది.
