8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..! రూ. 360 నుంచి రూ. 7500 వరకు DA పెంపు? మీ శాలరీ ఎంత పెరుగుతుందంటే?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 2 శాతం నుంచి 3శాతం మేర పెరగనుంది. మొత్తం డీఏ సుమారు 60 శాతానికి చేరుతుంది. పూర్తి లెక్కల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- April 16, 2026 / 11:13 AM IST
8th Pay Commission DA Hike 2026
- డీఏలో 2 శాతం నుంచి 3శాతం పెరుగుదల ఖాయం
- మొత్తం డీఏ సుమారు 60 శాతానికి పెరగనుంది
- జనవరి 1, 2026 నుంచి పూర్తిగా బకాయిలు చెల్లింపులు
8th Pay Commission DA Hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. డీఏ పెంపు (2026)పై కీలక ప్రకటన వచ్చేసింది. అతి త్వరలో నిరీక్షణ ముగియనుంది. ఈసారి ప్రకటన ఆలస్యమైనప్పటికీ డీఏ పెంపు ఖాయంగా కనిపిస్తోంది.
ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఈసారి డీఏ 2శాతం నుంచి 3శాతం వరకు పెరిగే (8th Pay Commission) అవకాశం ఉంది. మొత్తంగా డీఏ సుమారు 60శాతం (2026 నాటికి డీఏ 60 శాతానికి పెంపు) లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. పూర్తి లెక్కలపై ఓసారి లుక్కేయండి..
ఎవరికి ఎంత బెనిఫిట్ అంటే? :
ఈ డీఏ పెంపు మీ కనీస వేతనంపై ఆధారపడి ఉంటుంది.
- రూ. 18వేల కనీస వేతనం : నెలకు రూ. 360 నుంచి రూ.540కి పెరుగుతుంది
- రూ. 29,200 కనీస వేతనం : జీతం రూ. 584 పెరిగి రూ. 876 అవుతుంది.
- రూ. 56,100 కనీస వేతనం : అదనంగా నెలకు రూ. 1,100 బెనిఫిట్స్
- రూ. 2.5 లక్షలు (సీనియర్ లెవల్) : ప్రతి నెలా రూ. 5వేల నుంచి రూ. 7,500 వరకు జీతం పెంపు
డీఏ ఆలస్యానికి కారణం ఏంటి? :
సాధారణంగా డీఏ మార్చి నాటికి ప్రకటిస్తారు. కానీ, 2026లో కొంత ఆలస్యం జరిగింది. పరిపాలనాపరమైన ప్రక్రియలు 8వ వేతన సంఘం విధానానికి మారడం వల్ల ఈ ఆలస్యం జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read Also : కొత్త హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ అదుర్స్.. ఈ మిడ్ సైజ్ SUV ధర జస్ట్ ఎంతంటే?
అయితే, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ 2026-27లో జీతాలు, పెన్షన్ల కోసం తగినన్ని నిధులను కేటాయించింది. డీఏను నిలిపివేసే అవకాశమే లేదు.
పూర్తి బకాయిలు ఎప్పుడంటే? :
ఈ ప్రకటనతో ఏప్రిల్‌లో డీఏ పెంపు ఉంటుందని అంచనా వేయగా నిబంధనల ప్రకారం.. జనవరి 1, 2026 నుంచి మాత్రమే అమలులోకి వచ్చింది. అంటే.. ప్రభుత్వ ఉద్యోగులు గత నెలల బకాయిలన్నింటినీ ఒకేసారి అందుకుంటారు.
డీఏ ఫార్ములా గత 12 నెలల (సీపీఐ-ఐడబ్ల్యూ)పై ఆధారపడి ఉంటుందని ఆదిల్ శెట్టి పేర్కొన్నారు. 2016లో కేవలం 2శాతంగా ఉన్న డీఏ, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇప్పుడు 60శాతానికి చేరుకుంది. ఈ జీతాల పెంపుతో ద్రవ్యోల్బణం భారీ తగ్గే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఆగితే పెరగబోయే జీతం, పెన్షన్లు ఎంత అనేది క్లారిటీ వస్తుంది.
