8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట.. జీతభత్యాలపై సూచనలకు మరో ఛాన్స్.. కొత్త తేదీ ఇదిగో!

8th Pay Commission : 8వ వేతన సంఘం సూచనలు సమర్పించేందుకు గడువును మరోసారి పొడిగించింది. మీ జీతం, భత్యాల భవిష్యత్తును నిర్ణయించే ఈ 18-అంశాల ప్రశ్నావళిని సమర్పించేందుకు ఇదే మీకు చివరి అవకాశం. ఎలా? ఎక్కడ అప్లయ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

8th Pay Commission

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్
  • జీతభత్యాలపై సూచనలకు మరో ఛాన్స్
  • అధికారిక పోర్టల్ MyGov లింక్ ద్వారా అభిప్రాయాలు

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. 8వ కేంద్ర వేతన సంఘం 18-అంశాల ఆన్‌లైన్ ప్రశ్నావళిని సమర్పించే గడువును మరోసారి పొడిగించింది. గతంలో మార్చి 16గా ఉన్న గడువు ఉండగా ఇప్పుడు మార్చి 31, 2026 వరకు అభిప్రాయాలను సమర్పించవచ్చు.

వేతనం, భత్యాలు, సేవా నిబంధనలకు సంబంధించి మరింత మంది తమ సూచనలను పంచుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ ఉద్యోగ సంఘాలు, వ్యక్తుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

MyGov పోర్టల్ ద్వారా సూచనల స్వీకరణ :
అధికారిక పోర్టల్ (8cpc.gov.in)లో అందుబాటులో ఉన్న MyGov లింక్ ద్వారా మాత్రమే అభిప్రాయాలను స్వీకరిస్తామని వేతన సంఘం స్పష్టం చేసింది. ఇమెయిల్, పోస్ట్ ద్వారా లేదా PDF ఫార్మాట్‌లో సమర్పించిన దరఖాస్తులను పరిగణించరు. ప్రశ్నాపత్రం హిందీ, ఆంగ్లం రెండు భాషలలోనూ అందుబాటులో ఉంది. సంఘం ఈ సూచనలను సమిష్టిగా విశ్లేషిస్తుంది. అభిప్రాయాలు అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి.

Read Also : Samsung Galaxy S25 Ultra : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ S25 అల్ట్రాపై భారీ తగ్గింపు.. ఇంతకీ ఫోన్ కొనాలా? వద్దా?

నివేదికను 18 నెలల్లో సమర్పించాలి :
8వ వేతన సంఘం 2025 చివరిలో లాంఛనంగా ఏర్పాటైంది. నివేదికను పూర్తి చేసేందుకు 18 నెలల గడువు ఉంది. అవసరమైన అన్ని మార్గదర్శకాలు 2026 ఫిబ్రవరిలోనే ఒక పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణం, పింఛను నిబంధనలు, భత్యాల వర్గీకరణను సమీక్షించి, సిఫార్సులను రూపొందించడమే ఈ సంఘం మొదటగా చేయాల్సిన పని.

సిఫార్సులను ఎప్పుడు అమలు చేస్తారు? :
కమిషన్ అభిప్రాయాలను సేకరిస్తున్నప్పటికీ తుది సిఫార్సులను సమర్పించి అమలు చేసేందుకు ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. పార్లమెంటుకు అందించిన సమాచారం ప్రకారం.. సిఫార్సులు ఆమోదించిన తర్వాతే అమలు, బకాయిలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఏదిఏమైనా.. జీతాల పెంపు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చినట్టే. బకాయిలను కూడా అదే తేదీ నుంచి లెక్కించే అవకాశం ఉంది.