×
Ad

8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు జాగ్రత్త.. ‘8వ వేతన కమిషన్‌’పై బిగ్ వాట్సాప్ స్కామ్.. మీరేం చేయాలి? ఏం చేయకూడదంటే?

8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకారం సవరించిన జీతాన్ని వెంటనే అంచనా వేయవచ్చనని మోసగాళ్ళు కేంద్ర ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారు.

  • Published On : February 19, 2026 / 06:31 PM IST

8th Pay Commission WhatsApp scam

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం హెచ్చరిక
  • సైబర్ నేరగాళ్లు వాట్సాప్ బిగ్ స్కామ్ వెలుగులోకి
  • 8వ వేతన సంఘం సంబంధించి అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దు

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. దాదాపు 10 మిలియన్ల ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన కమిషన్ కోసం ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్ళు కొత్త వాట్సాప్ స్కామ్‌కు తెరలేపారు.

నివేదికల ప్రకారం.. 8వ వేతన కమిషన్ కింద వారి సవరించిన జీతాలను వెంటనే అంచనా వేయవచ్చనని పేర్కొంటూ మోసగాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇందులో ఒక లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతారు. తొందరపడి ఆ లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఖతమే.. మీ బ్యాంకు మొత్తం ఖాళీ చేసేస్తారు..

సైబర్ ఫ్రాడ్ ఎలా జరుగుతోంది? :
వాస్తవానికి ఈ చీటింగ్ అనేది ఒక సాధారణ శాలరీ కాలిక్యులేటర్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, ఇది నిజానికి డేంజరస్ మాల్వేర్. యూజర్లు APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశాక సైబర్ నేరగాళ్లు మీ
మొబైల్ డివైజ్ రిమోట్ యాక్సెస్ పొందుతారు. వారు మీ ఫోన్ నుంచి సున్నితమైన డేటాను దొంగిలించవచ్చు.

Read Also : EPFO Pension Plan : EPFO పెన్షన్‌పై బిగ్ అప్‌డేట్ : ఉద్యోగులకు ఇక ఫుల్ శాలరీతో ఎక్కువ పెన్షన్, వారికి మాత్రమే బెనిఫిట్!

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసేందుకు బ్యాంకింగ్ యాప్‌లు, OTP, పాస్‌వర్డ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు తాము మోసపోయిన విషయం వెంటనే గ్రహించలేరని అధికారులు హెచ్చరిస్తున్నారు. అది గ్రహించే సమయానికి వారి అకౌంట్ల నుంచి డబ్బు ఖాళీ అవుతుంది.

అసలు ప్రభుత్వం చెప్పిందేంటి? :
ఇలాంటి అనుమానాస్పద వాట్సాప్ మెసేజ్, లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది. 8వ వేతన సంఘానికి సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా అధీకృత మార్గాల ద్వారా మాత్రమే విడుదల అవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఏం చేయాలి, ఏం చేయకూడదంటే? :

  • గుర్తుతెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు.
  • వాట్సాప్ లేదా సోషల్ మీడియా నుంచి APK ఫైళ్ళను డౌన్‌లోడ్ చేయొద్దు.
  • యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్/ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.
  • బ్యాంకింగ్ వివరాలు, OTP లేదా పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ షేర్ చేయొద్దు.

మీరు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినట్లయితే.. వెంటనే బ్యాంకుకు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి రిపోర్టు చేయండి. మొత్తం మీద, 8వ వేతన సంఘంపై ప్రభుత్వ ఉద్యోగుల ఆసక్తిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. దీనికి అప్రమత్తంగా ఉండటం ఒకటే మార్గం..