EPFO Pension Plan : EPFO పెన్షన్‌పై బిగ్ అప్డేట్ : ఉద్యోగులకు ఇక ఫుల్ శాలరీతో ఎక్కువ పెన్షన్, వారికి మాత్రమే బెనిఫిట్!
EPFO Pension Plan : ఈపీఎఫ్ఓ పాత "హయ్యర్ పెన్షన్" ఆప్షన్ తిరిగి తీసుకొచ్చింది. అర్హత కలిగిన ఉద్యోగులు ఇప్పుడు వారి అసలు జీతం ఆధారంగా పెన్షన్ పొందవచ్చు. ఈ ఫీచర్ 2014కి ముందు ఈ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
EPFO Pension Plan
- ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. జీతం మొత్తం ఆధారంగా పెన్షన్
- ఈ ఉద్యోగులకు మాత్రమే ఫుల్ శాలరీ పెన్షన్ బెనిఫిట్స్
- ఫుల్ శాలరీతో ఈపీఎఫ్ఓ పెన్షన్, కొత్త లెక్కలు ఇలా..
EPFO Pension Plan : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లక్షలాది మంది ఖాతాదారులకు కీలక అప్డేట్ జారీ చేసింది. జీతం ఆధారంగా పెన్షన్లకు డబ్బును డిపాజిట్ చేసే పాత పెన్షన్ పద్ధతిని ఈపీఎఫ్ఓ తిరిగి ప్రవేశపెట్టింది.
నివేదిక ప్రకారం.. 2014లో పెన్షన్ జీతంపై పరిమితి విధించిన తర్వాత పీఎఫ్ ఖాతాదారుల్లో గందరగోళం నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రయోజనం అందరికీ అందుబాటులో లేదు. పరిమిత వర్గం ఉద్యోగులకు మాత్రమే ఈ రిలీఫ్ దక్కనుంది.
కొత్త నిర్ణయం ఏంటి? ఎవరికి బెనిఫిట్? :
ఈపీఎఫ్ఓ నిర్ణయం ప్రకారం. అర్హతగల ఉద్యోగులు ఇప్పుడు వారి మొత్తం జీతం ఆధారంగా పెన్షన్ ఫండ్ పొందవచ్చు. చట్టబద్ధమైన పరిమితి రూ. 15వేలు మాత్రమే కాదు. అయితే, 2014 సవరణకు ముందు “అధిక పెన్షన్” ఆప్షన్ ఇప్పటికే ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది కొత్త ప్రయోజనం కాదు. 2014 జీత పరిమితి తర్వాత పాత పెన్షన్ విధానంలో గందరగోళంతో తిరిగి అదే పెన్షన్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
2014లో జీతం పరిమితి, పెన్షన్ లెక్కలివే :
2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 1,000గా నిర్ణయించింది. గరిష్ట పెన్షన్ జీతాన్ని నెలకు రూ.15వేలకు పెంచింది. గతంలో, ఈ పరిమితి రూ. 6,500. క్యాపింగ్ ప్రభావం ఏమిటంటే.. ఒక ఉద్యోగి జీతం రూ. 50వేలు అయినప్పటికీ వారి పెన్షన్ గరిష్టంగా రూ. 15వేలు ఆధారంగా లెక్కించారు.
పదవీ విరమణ తర్వాత గరిష్ట పెన్షన్‌ను సుమారు రూ. 7,500కి పరిమితం చేశారు. ఇప్పుడు, ఈ సౌకర్యాన్ని మళ్లీ ప్రవేశపెడుతోంది. పాత ఆప్షన్ ఉన్న ఉద్యోగుల పెన్షన్ వారి వాస్తవ జీతానికి అనుగుణంగా పెరుగుతుంది అనమాట.
రూ. 15వేల కన్నా ఎక్కువ జీతాలతో ఈపీఎఫ్ఓలో చేరిన కొత్త ఉద్యోగులు వారి వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ ప్లాన్ ఎంచుకునేందుకు అనుమతి లేదు. అధిక సంపాదన కలిగిన ఖాతాదారులకు పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా భారీగా తగ్గుతాయి.
ఈపీఎఫ్ఓ, పెన్షన్ ఎలా పొందవచ్చు? :
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. యజమాని, ఉద్యోగి ఇద్దరూ ప్రాథమిక జీతంలో 12శాతం ప్రావిడెంట్ ఫండ్ (PF)కి డిపాజిట్ చేస్తారు. యజమాని కాంట్రిబ్యూషన్ కొంత భాగం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS)లోకి వెళుతుంది.
చాలా సందర్భాలలో యజమానులు ఉద్యోగి పూర్తి జీతం కన్నా చట్టబద్ధమైన వేతన పరిమితి ఆధారంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ లెక్కిస్తారు. గతంలో, వేతన పరిమితి రూ. 6,500గా ఉండేది. ఆ తర్వాత రూ. 15వేలకి పెంచారు. పెన్షన్ జీతం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. చాలా మంది ఉద్యోగులు తక్కువ నెలవారీ పెన్షన్లు పొందుతారు.
2014 నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్ జీతం రూ. 15వేలకు పరిమితమైంది. గత ఆప్షన్ వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్‌ను అనుమతించింది. వేతన పరిమితిని ప్రవేశపెట్టిన తర్వాత ఆప్షన్ నిలిపివేశారు. కానీ, ఇప్పుడు హైయర్ పెన్షన్ ఆప్షన్ తిరిగి తీసుకురావడం ద్వారా ముందుగా ఎంచుకున్న ఉద్యోగులకే భారీగా ప్రయోజనం కలుగనుంది.
కంపెనీ యజమాని సమ్మతి తప్పనిసరి :
ఈపీఎఫ్ఓ ప్రయోజనం పొందాలంటే కేవలం ఉద్యోగి అంగీకారం మాత్రమే సరిపోదు. యజమాని సమ్మతి, కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు అంగీకారం తప్పనిసరి. కంపెనీ అధిక కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు ఇష్టపడకపోతే ఉద్యోగి ఈ ఆప్షన్ మాత్రమే ఎంచుకోలేరు.
ఈ నిర్ణయం ఇప్పటికే అధిక పెన్షన్లను ఎంచుకున్న వ్యవస్థీకృత రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. అయితే, కాంట్రిబ్యూషన్ కనీస పరిమితి కారణంగా చాలా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, పెన్షన్ మొత్తాలలో భారీగా మార్పులు రానున్నాయి.
