AC Prices Hike : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న ఏసీల ధరలు.. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు కొనాలన్నా కొనలేరు..!
AC Prices Hike : ఏసీ, కూలర్లు కొంటున్నారా? కొంటే ఇప్పుడే కొనేసుకోండి. ఏప్రిల్ నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 24, 2026 / 02:14 PM IST
AC Prices Hike
- సమ్మర్‌లో ఒకేసారి పెరగనున్న ఏసీలు, వాషింగ్ మిషన్ ధరలు
- మార్కెట్లో 10శాతం నుంచి 12 శాతం పెరగనున్న ఏసీల ధరలు
- అకాల వర్షాలు ఏసీ మార్కెట్‌పై ఎఫెక్ట్, మార్చిలో తగ్గిన అమ్మకాలు
AC Prices Hike : కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే ఏప్రిల్‌లో ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, సరఫరా సంబంధిత సమస్యల కారణంగా ఏసీ తయారీదారులు ధరలను పెంచాలని భావిస్తున్నారు.
ఇప్పటికే మార్కెట్లో ఏసీల ధరలను పెంచుతూ పలు ఏసీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నెలలో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర భారీ హోం అప్లియన్సెస్ అమ్మే కంపెనీలకు ఈ తొలి సీజన్ చాలా కీలకంగా మారింది. రానున్న రోజుల్లో ఏసీల ధరలు పెరుగుదలకు దారితీసే కారణాలను వివరంగా తెలుసుకుందాం..
అకాల వర్షాలు ఏసీ మార్కెట్‌కు దెబ్బ :
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాలతో ఏసీ తయారీదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చిలో కురిసిన ఈ అకాల వర్షాలు తొలి అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే, ఏప్రిల్‌లో ఎండ పూర్తిగా ఉంటే మళ్లీ ఏసీలకు డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఏసీల ధరలు 12 శాతం వరకు పెరగొచ్చు :
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి పదార్థాలు ముఖ్యంగా ప్లాస్టిక్ ధరలను పెంచుతున్నాయి. ఒక వాషింగ్ మెషీన్ తయారీ మొత్తం ఖర్చులో కేవలం ప్లాస్టిక్ వాటానే సుమారు 20శాతం ఉంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 10 శాతం నుంచి 12 శాతం వరకు గణనీయంగా పెరగవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
Read Also : Vivo X200 Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ వివో X200 ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు!
గ్యాస్ కొరత ఉత్పత్తికి ఆటంకం :
ఎల్పీజీ సరఫరా విషయంలో మరో పెద్ద సమస్య తలెత్తింది. గృహ వంటగ్యాస్‌కు ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాను సగటు వినియోగంలో 80 శాతం నుంచి 65 శాతానికి తగ్గించింది. దీని కారణంగా ఏసీల తయారీ ప్రక్రియ ప్రభావితమవుతోంది.
హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్.ఎస్. సతీష్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వేసవి కాలానికి ముందు ఏసీల ఉత్పత్తిని 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాల్సి రావచ్చు. ఎందుకంటే ఏసీ కంపెనీలకు వేసవి కాలంలోనే ఎక్కువ మార్కెట్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గోద్రెజ్ ఏసీ ధరల పెంపు :
గోద్రెజ్ కంపెనీ ప్రకారం.. వచ్చే వారం తర్వాత ఢిల్లీ, ఉత్తర భారత్‌లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే, అమ్మకాలపై ప్రభావం ఇప్పుడే చెప్పలేమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గత జనవరిలో కొత్త ఎనర్జీ లేబులింగ్ నిబంధనల కారణంగా కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటికే ఏసీల ధరలను పెంచేశాయి. పెరిగిన ముడి పదార్థాలు, రవాణా ఖర్చులతో ఏప్రిల్‌లో ఏసీల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది . ఏప్రిల్ 1 నుంచి ఏసీల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతాయని గోద్రెజ్ సూచించింది.
వినియోగదారులపై ప్రభావం ఉంటుందా? :
కంపెనీలు ఏసీల ధరలు పెంచితే వినియోగదారుల కొనుగోళ్లపై నేరుగా ప్రభావం పడుతుంది. ఖరీదైన మోడళ్ల నుంచి చౌకైన లేదా తక్కువ పవర్ ఫుల్ ప్రొడక్టులకు వినియోగదారులు మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఉదాహరణకు.. ఒక వాషింగ్ మెషీన్ మొత్తం ఖర్చులో సుమారు 20 శాతం ప్లాస్టిక్‌దే ఉంటుంది. అందుకే పెరుగుతున్న ప్లాస్టిక్ ధరల ప్రభావం ఎయిర్ కండిషనర్లపై మాత్రమే కాకుండా ఇతర హోం అప్లియన్సెస్ పై కూడా పడవచ్చు.
