Adani Group : ఈ-కామెర్స్ లోకి అదానీ గ్రూప్.. పేటీఎం.. ఫోన్ పేలతో సై అంటే సై
పేటీఎం ఫోన్ పేలతో సై అంటే సై అనేందుకు అదానీ గ్రూప్ సిద్దమవుతుంది. త్వరలో ఈ కామెర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
- kunduru Vinod
- Published On : August 16, 2021 / 06:51 AM IST
Adani Group
Adani Group : ఈ- కామర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. ఆదానీ డిజిటల్ ల్యాబ్స్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో గౌతం ఆదానీ ఈ సంగతి చెప్పారు. ఈ-కామర్స్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్, రీ చార్జింగ్ సర్వీస్ తదితర సేవలను తన ఖాతాదారులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గౌతం ఆదానీ తెలిపారు.
టాటా సన్స్, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలతోపాటు ఫోన్ పె, పేటీఎం, గూగుల్ పే వంటి న్యూ ఏజ్ కంపెనీలతో పోటీ పడేందుకు సిద్దమవుతుంది. ఆదానీ గ్రూప్‌కు 400 మిలియన్ల కన్జూమర్లు ఉన్నారు. కాగా దేశంలోని చాలా పోర్టులు ఆదానీ గ్రూప్స్ చేతిలోనే ఉన్నాయి. వంట నూనెలు, గ్యాస్, విమానాశ్రయాలు, రియాల్టీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, విద్యుత్ తదితర రంగాల్లో ఆదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలు జరుపుతోంది.
