Vehicles V2V Communication : ఇక వాహనాలే మాట్లాడుకుంటాయి..! V2V టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కేంద్రం మాస్టర్ ప్లాన్!

Vehicles V2V Communication : అక్టోబర్ 1, 2028 నుంచి అన్ని వాహనాలకు V2V కమ్యూనికేషన్ సిస్టమ్ అమర్చనున్నారు. తద్వారా ముందు వాహనం వెనుక వాహనంతో మాట్లాడుకుంటాయి. ప్రమాదం జరగకుండా సేఫ్టీ మోడ్ ద్వారా ముందుకు దూసుకెళ్లనున్నాయి..

Vehicles V2V Communication

  • కారు నడిపేవారికి బిగ్ అలర్ట్.. ఇక ప్రతి వాహనంలో V2V సిస్టమ్ తప్పనిసరి
  • వాహనాల్లో కొత్త టెక్నాలజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 2028 నుంచి కొత్త రూల్
  • యాక్సిడెంట్‌కు ముందే వార్నింగ్.. రోడ్లపై ప్రమాదాలకు చెక్ పడినట్టే

Vehicles V2V Communication : వావ్.. కారు కారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది.. ఇదేదో సైన్స్ ఫిక్చన్ మూవీ అనుకుంటారేమో.. కాదు కాదు.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ నిజంగానే రాబోతుంది. ఒక వాహనం మరో వాహనంతో మాట్లాడితే ఎలా ఉంటుందో రియల్ టైమ్ మనం చూడొచ్చు. ముందున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే.. వెనుక వస్తున్న కారు డ్రైవర్ స్పందించేలోపే ఆ సమాచారం వాహనానికి క్షణాల్లో చేరిపోతుంది.

అంటే.. రోడ్డు ప్రమాదాలు జరగకముందే వాహనాలు పసిగట్టి సేఫ్టీ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. అదే.. V2V (Vehicle-to-Vehicle) టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సాయంతోనే వాహనాలు ఒకదానితో ఒకటి డేటాను షేర్ చేసుకుంటాయి. స్పీడ్, డైరెక్షన్, బ్రేకింగ్, ట్రాఫిక్ పరిస్థితులు వంటి క్షణాల్లో డేటా ఎక్స్ఛేంజ్ చేసుకుంటాయి.. ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు బ్రేక్ పడనుంది.

రోడ్లపై సేఫ్టీకి కేంద్రం మాస్టర్ ప్లాన్ :
దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. వాహనాల మధ్య కమ్యూనికేషన్ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఈ విషయంలో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వాహనాల్లో వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ సిస్టమ్ దశలవారీగా తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లో సవరణలు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.

ప్రతి వాహనంలో V2V టెక్నాలజీ మస్ట్ :
ప్రతిపాదనల ప్రకారం.. 2028 అక్టోబర్ 1 నుంచి లేదా ఆ తర్వాత రాబోయే అన్ని L, M, N కేటగిరీ వాహనాల్లో V2V కమ్యూనికేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే ఈ టెక్నాలజీని వాడే వాహనాలు మాత్రం 2027 అక్టోబర్ 1 నుంచే నిర్దేశించిన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దశలవారీగా వాహన తయారీ సంస్థలు, ఇతర పార్టనర్లు కొత్త నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తయారు చేసేందుకు అవకాశం లభిస్తుందని కేంద్రం తెలిపింది.

Read Also : Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై అదిరే ఆఫర్లు.. రూ. 80వేల విలువైన 65-అంగుళాల స్మార్ట్‌టీవీ జస్ట్ రూ.37,349కే..!

వాహనాల మధ్య రియల్ టైమ్ డేటా :
రానున్న రోజుల్లో వాహనాల మధ్య రియల్ టైమ్ డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ V2V టెక్నాలజీ ద్వారా స్పీడ్, లొకేషన్, ట్రావెలింగ్ డైరెక్షన్ వంటి కీలక వివరాలు ఎప్పటికప్పుడూ ఒక వాహనం నుంచి మరో వాహనానికి చేరతాయి. దాంతో సడన్ బ్రేకింగ్, ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదం, అన్ సేఫ్ లేన్ మార్పులు, ఎమర్జెన్సీ వాహనాలు సమీపిస్తున్న సందర్భాల్లో డ్రైవర్లు లేదా వాహన భద్రతా వ్యవస్థలకు ముందుగానే అలర్ట్స్ అందుతాయి.

ఈ కొత్త టెక్నాలజీ కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ 5.875 నుంచి 5.925 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను కేటాయించింది. సాంప్రదాయ సేఫ్టీ సిస్టమ్స్‌తో పోలిస్తే నేరుగా దృష్టికి అందని పరిస్థితుల సమాచారాన్ని కూడా V2V టెక్నాలజీ అందించగలదు.

తద్వారా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ (ADAS), కనెక్టెడ్ మొబిలిటీ సర్వీసులు మరింత అడ్వాన్స్ అవుతాయి. ఫలితంగా రోడ్డుపై ప్రమాదాలను భారీగా తగ్గించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.