Amazon Great Summer Sale 2026 : గెట్ రెడీ.. అమెజాన్ సమ్మర్ సేల్ మళ్లీ వస్తోంది.. మే 8 నుంచే ప్రారంభం.. ఆఫర్లు, బెస్ట్ డీల్స్ ఇవే!
Amazon Great Summer Sale 2026 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మళ్లీ రాబోతుంది. మే 8 నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. బెస్ట్ డీల్స్ ఆఫర్లు, మరెన్నో బెనిఫిట్స్ సంబంధించి ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 1, 2026 / 07:17 PM IST
Amazon Great Summer Sale 2026
- శాంసంగ్, ఆసుస్, బోట్ వంటి బ్రాండ్‌ల ప్రొడక్టులపై భారీ ఆఫర్లు
- అమెజాన్ ప్రైమ్ సభ్యులు సేల్ బెనిఫిట్స్ ఫస్ట్ పొందవచ్చు
- ఈఎంఐలో కొనుగోలు చేసేవారికి అద్భతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సేల్ తిరిగి వచ్చేసింది.. కంపెనీ పాపులర్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 టీజర్ విడుదల అయింది. అలాగే సేల్ తేదీని కూడా అమెజాన్ ప్రకటించింది. ఈ వార్షిక సేల్ వేసవి కాలంలో ముఖ్యమైన ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. కంపెనీ త్వరలో సేల్ ఆఫర్లను కూడా ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు లభిస్తాయని అంచనా..
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 టీజర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. ఈ టీజర్ అమెజాన్ యాప్‌లో కూడా కనిపించింది. ఈ టీజర్ ద్వారా ప్రతి కేటగిరీలోని వందలాది ప్రొడక్టులపై భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
మే 8వ తేదీ నుంచి శాంసంగ్, ఆసుస్, బోట్ సేల్ ప్రారంభం కాబోతుంది. షాపింగ్ లిస్ట్ రెడీ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ సేల్ బెనిఫిట్స్ అమెజాన్ ప్రైమ్ సభ్యులు ముందుగా పొందవచ్చు. ప్రైమ్ సభ్యులకు సేల్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు.
రూ. 25వేల ధరలో భారీ ఆఫర్లు :
గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో అనేక పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఉంటాయని భావిస్తున్నారు. చాలా స్మార్ట్‌ఫోన్‌లు, ముఖ్యంగా బడ్జెట్ రేంజ్, భారీ డిస్కౌంట్లతో వస్తాయని అంచనా. రూ. 10వేల నుంచి రూ. 25వేల మధ్య ధరలో స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీలు భారీ ఆఫర్లను అందిస్తాయని భావిస్తున్నారు.
శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌ల నుంచి పాపులర్ ఫోన్‌లను సరసమైన ధరలకు సొంతం చేసుకోవచ్చు. నేరగా డిస్కౌంట్లతో పాటు కంపెనీ బ్యాంక్ ఆఫర్లను కూడా చేర్చనుంది. యూజర్లకు ఈఎంఐలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు పాత మొబైల్ ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్‌లపై కేవలం తక్కువ ఖర్చుతో అద్భుతమైన డీల్‌ను పొందవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌కు మారేందుకు ఇదే బెస్ట్ టైమ్. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లను కూడా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. వేసవిలో ఏసీలపై కూడా భారీ తగ్గింపులు పొందవచ్చు.
