Amazon Great Summer Sale : ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఇండియా (Amazon India) కొత్త గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. భారత మార్కెట్లో అతిత్వరలో ప్రారంభం కానుంది. రాబోయే సేల్ ఈవెంట్ ఎప్పుడు అనేది కచ్చితమైన తేదీని ఇంకా ధృవీకరించలేదు. అయితే, అమెజాన్ టీజర్లలో కొన్ని వివరాలను వెల్లడించింది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) యూజర్లకు ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వస్తుంది.
అమెజాన్ స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై కూడా భారీ తగ్గింపులను అందించనుంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా కొన్ని ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అనేక స్మార్ట్‌ఫోన్ అప్లియన్సెస్ కూడా ఇది వర్తిస్తుంది. ఈ సేల్ సమయంలో OnePlus, Samsung, Xiaomi, Realme నుంచి ఫోన్లను ఎక్కువగా అందించనుంది. నెలకు రూ. 1,555 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందించనుంది.
ఫోన్లతో పాటు, అమెజాన్ రాబోయే సేల్ ఈవెంట్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లు, మరిన్నింటిపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వివిధ కేటగిరీలలో లభించే తగ్గింపు శాతాలను కూడా అందిస్తుంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై రూ.40వేల వరకు తగ్గింపు ఆఫర్, టాబ్లెట్లపై 60 శాతం వరకు తగ్గింపు, హెడ్ఫోన్లపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.
Read Also : iPhone Users : ఐఫోన్ యూజర్లు ఈ కొత్త యాప్ ద్వారా విండోస్ పీసీలకు ఈజీగా కనెక్ట్ కావొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టెలివిజన్లతో పాటు అప్లియన్సెస్‌పై 60 శాతం వరకు తగ్గింపును అందించవచ్చు. టీవీని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. రిఫ్రిజిరేటర్లపై 60 శాతం వరకు తగ్గింపు, వాషింగ్ మెషీన్లపై 50 శాతం వరకు తగ్గింపు, టీవీల ఎక్స్చేంజ్పై అదనంగా రూ. 5వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ వినియోగదారులు పుస్తకాలు లేదా గేమ్‌ల పట్ల ఆసక్తి ఉంటే.. అమెజాన్ సేల్ సమయంలో బెస్ట్ డీల్‌ను పొందవచ్చు. ఎందుకంటే.. 70 శాతం వరకు తగ్గింపును పొందవచ్చునని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ డివైజ్‌ల విషయానికొస్తే.. వినియోగదారులు అలెక్సా డివైజ్‌లపై 30 శాతం వరకు, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టీవీ క్యూబ్‌పై 40 శాతం వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈవెంట్‌కు సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, కంపెనీ గత ఈవెంట్లను పరిశీలిస్తే.. సేల్కు ముందు కొన్ని బెస్ట్ ఫోన్ డీల్‌లను టీజ్ చేస్తుందని భావిస్తున్నారు. సేల్ సమయంలో వినియోగదారులు ఎలాంటి ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డీల్‌లను పొందవచ్చు అనేది ముందుగానే తెలుసుకోవచ్చు.