MG Comet EV Launch : అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో ఎంజీ కామెట్ EV కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 230కి.మీ దూసుకెళ్తుంది.. ధర ఎంతంటే?

MG Comet EV Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఎంజీ మోటార్ ఇండియా నుంచి MG Comet అనే కొత్త ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో ఈవీ కారు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

MG Comet EV Launch : అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో ఎంజీ కామెట్ EV కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 230కి.మీ దూసుకెళ్తుంది.. ధర ఎంతంటే?

MG Comet EV launch price starts at Rs 7.98 lakh _ Specs, features, range, Check Full Details

MG Comet EV Launch : ప్రముఖ ఎలక్ట్రానిక్ మోటార్ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) సరికొత్త ఎంజి కామెట్ ఈవీ (EV) స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 26న అధికారికంగా MG కామెట్ ఈవీ(EV)ని ఆవిష్కరించింది. 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ ల్యాండ్ కంపెనీ ఎంజీ మోటార్ భారత మార్కెట్లో అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రకటించింది. ఈ కొత్త ఈవీ కారు.. మల్టీ GS ఈవీ-ప్లాట్‌ఫారమ్-ఆధారిత ప్యూర్ ఈవీ కొద్దిపాటి విశాలమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. కామెట్ ఈవీ కారు ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో రెండవ ఈవీగా వచ్చింది. ఫ్యూచర్, యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ టెక్నాలజీలతో వచ్చింది. ఎంజీ కామెట్ ఈవీ కారు ప్రత్యేక ప్రారంభ ధర రూ 7,98,000 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.

ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ.. ‘అర్బన్ మొబిలిటీతో భారత మార్కెట్లో ఎంజీ కామెట్ ఈవీని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కామెట్ ఈవీ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ జీఎస్‌ఈవీ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించడం జరిగింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ఈవీ విక్రయాల మార్కును చేరుకుంది. స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. సెక్యూరిటీ ఫీచర్లతో వినియోగదారులకు విశాలమైన రైడ్‌ను అందిస్తుంది. కామెట్ ఈవీతో స్టైల్ విషయంలో రాజీ పడకుండా స్మార్ట్ ఆప్షన్ ఎంచుకునేలా చేయడమే కంపెనీ లక్ష్యం’ అని చాబా వివరించారు.

స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఇవే :
ఎంజీ కామెట్ ఈవీలో బయట, లోపల సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. 17.3 kWh లి-ఐయాన్ బ్యాటరీతో పాటు ప్రిస్మాటిక్ సెల్స్‌తో వచ్చింది. సుదీర్ఘ సైకిల్ లైఫ్ 39 పటిష్టమైన సెక్యూరిటీ టెస్టులను పూర్తిచేసింది. IP67-రేటెడ్‌తో వాటర్, డెస్ట్ వంటి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. 17 హాట్ స్టాంపింగ్ ప్యానెల్‌లతో హై స్ట్రెంత్ వెహికల్ బాడీతో వచ్చింది. ఈ స్మార్ట్ ఈవీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 పాయింట్, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా &సెన్సార్, టీపీఎంఎస్ (ఇన్‌డైరెక్ట్), ISOFIX చైల్డ్ సీట్వంటి సెగ్మెంట్-లీడింగ్ యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్‌లతో వచ్చింది.

Read Also : Best WhatsApp Tricks : వాట్సాప్ యూజర్లకు 3 బెస్ట్ ట్రిక్స్.. ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే సెకన్లలో చాట్ చేయొచ్చు తెలుసా?

స్మార్ట్ టెక్ ఫీచర్లు :
ఇంటెలిజెంట్ టెక్ డాష్‌బోర్డ్ సెక్షన్లలో ఎంజీ కామెట్ ఈవీ మోడ్రాన్ ఫీచర్లను అందిస్తుంది. ఇంటర్నల్ ఐస్మార్ట్ (iSmart)సిస్టమ్ 100+ వాయిస్ కమాండ్‌లు, 55+ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో వస్తుంది. 10.25’ హెడ్ యూనిట్, 10.25’ డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ ట్విన్ డిస్‌ప్లే వైడ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఎంటర్‌టైన్మెంట్ కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లను అందించేందుకు ఎంటర్‌టైన్మెంట్ సిస్టమ్ 3 పూర్తిగా కస్టమైజడ్ పేజీల విడ్జెట్‌లతో అమర్చబడి ఉంటుంది. ఎంజీ కామెట్ ఈవీ మరో స్పెషల్ ఫీచర్ స్టైలిష్ డిజైన్ స్మార్ట్ కీ కలిగి ఉంది.

MG Comet EV launch price starts at Rs 7.98 lakh _ Specs, features, range

MG Comet EV launch price starts at Rs 7.98 lakh

స్మార్ట్ డిజైన్ :
ఎంజీ కామెట్ ఈవీ కారు డిజైన్ చూస్తే.. ఫ్యూచర్-టెక్నాలజీని సూచిస్తోంది. ‘బిగ్ ఇన్‌సైడ్, కాంపాక్ట్ అవుట్‌సైడ్’ (BICO) కాన్సెప్ట్‌‌తో రూపొందించిన కామెట్ ఈవీ సౌకర్యవంతమైన విశాలమైన లెగ్‌రూమ్‌తో పాటు హెడ్‌రూమ్‌ను అందిస్తుంది. కర్వ్‌డ్ టెక్ బాడీ లైన్ బయటి నుంచి ఏరోడైనమిక్, స్టైలిష్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మెట్ ఈవీ సైడ్ ఫ్లోటింగ్ మోటిఫ్‌తో ఫ్యూచరిస్టిక్ రియర్-వ్యూ మిర్రర్ డిజైన్‌ కూడా ఉన్నాయి. రెండో వరుసలో ఏరో-క్రాఫ్ట్ క్యాబిన్ విండో అడిషనల్ విజిబిలిటీని అందిస్తుంది.

కామెట్ ఈవీ GSEV ఆధారంగా రెండో వరుస సీట్లలో 50:50 సెట్టింగ్‌లతో 4-సీటర్ కాన్ఫిగరేషన్‌తో వచ్చింది. అందులో రూమి క్యాబిన్‌ను కూడా కలిగి ఉంది. మోడ్రాన్- క్యాబిన్ స్పేస్, ఇంటరాక్టివ్ వంటి అనేక ఫంక్షన్లతో స్మార్ట్ టెక్నాలజీ కాన్ఫిగరేషన్‌లతో వచ్చింది. కామెట్ ఈవీ మల్టీ-ఫంక్షన్లలో ప్రత్యేకంగా రూపొందించిన స్టీరింగ్ టెక్ కూడా ఉంది.

ఫ్యూచరిస్టిక్ పాడ్-లాంటి కంట్రోల్ అందిస్తుంది. రోటరీ గేర్ సెలెక్టర్.. క్రోమ్ రింగ్‌లు, స్పెషల్ మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో ఎలక్ట్రిక్ విండో ఆపరేషన్ బటన్స్, 12-వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ ఎలక్ట్రిక్ ప్యాకేజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. కామెట్ ఈవీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. దాదాపు 230 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. పార్క్ చేయడంతో పాటు ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీ..

స్మార్ట్ ఛాయిస్ :
ఎంజీ కామెట్ ఈవీ రెండు స్పెషల్ ఎడిషన్‌లను కూడా రిలీజ్ చేసింది. అందులో గేమర్ ఎడిషన్, ఎల్‌ఐటీ ఎడిషన్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ పట్టణ ప్రయాణికుల-గేమింగ్, టెక్ కమ్యూనిటీలు, ఫ్యాషన్‌ వంటి ఆసక్తి కలిగిన వినియోగదారులకు అనుగుణంగా ఈవీ కారును తయారు చేశారు. ఎంజీ కామెట్ ఈవీ 250+ డెకాల్ ఆప్షన్లు, గ్రాఫిక్స్ సహా అనేక పర్సనలైజ్ ఆప్షన్లతో వచ్చింది.

స్మార్ట్ సేవింగ్స్ :
అర్బన్ వినియోగదారులకు ఎంజీ కామెట్ ఈవీ కారు 1,000 కి.మీకు రూ.519 చొప్పున ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. తద్వారా ఛార్జింగ్ ఖర్చును మరింత ఆదా చేస్తుందని ఎంజీ అంచనా వేస్తోంది.

Read Also : iPhone Users : ఐఫోన్ యూజర్లు ఈ కొత్త యాప్ ద్వారా విండోస్ పీసీలకు ఈజీగా కనెక్ట్ కావొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!