Amazon Mega TV Fest Sale 2025
Amazon Mega TV Fest Sale 2025 : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.. షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మెగా టీవీ ఫెస్ట్ సేల్ ప్రారంభమైంది. మీ ఇంటికి కొత్త టీవీ తెచ్చుకోవచ్చు. ఈ సేల్ డిసెంబర్ 10, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్‌లో టాప్-బ్రాండ్ టీవీలను 65శాతం వరకు డిస్కౌంట్లతో అందిస్తుంది. రూ.12వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.5,000 డిస్కౌంట్ కూపన్‌తో లభిస్తుంది. లిమిటెడ్ టైమ్ సేల్ ఆఫర్లు మాత్రమే.. ఇప్పుడు కొంటేనే సరసమైన ధరలో కొత్త టీవీని తెచ్చుకోవచ్చు. ఏయే స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
TCL 55-అంగుళాల 4K అల్ట్రా QLED టీవీ :
ఈ లిస్టులో TCL స్మార్ట్‌టీవీ ఉంది. మీరు 55-అంగుళాల స్క్రీన్, ప్రీమియం ఫీచర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ సరసమైన ధరకు హై-ఎండ్ పిక్చర్, సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 35W డాల్బీ అట్మాస్ సౌండ్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ పవర్‌ఫుల్ QLED టీవీ రూ. 35,990కు సేల్ సమయంలో 67శాతం వరకు తగ్గింపుతో లభిస్తుంది.
శాంసంగ్ 32-అంగుళాల QLED స్మార్ట్ టీవీ :
శాంసంగ్ నుంచి ఈ కాంపాక్ట్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ అద్భుతమైన ఆప్షన్. ప్రీమియం పిక్చర్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు, స్ట్రాంగ్ బిల్డ్‌ను కలిగి ఉంది. HDR, PurColor మైక్రో డిమ్మింగ్ ప్రో వంటి టెక్నాలజీని కూడా కలిగి ఉంది. HD రిజల్యూషన్, మెరుగైన బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ కలర్ క్వాలిటీని అందిస్తుంది. మీరు అమెజాన్ నుంచి 27శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 12,990కి తగ్గుతుంది.
ఏసర్ 40-అంగుళాల స్మార్ట్ LED టీవీ :
ఏసర్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌టీవీ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. 26W డాల్బీ ఆడియో, ఫ్రేమ్‌లెస్ ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. 40-అంగుళాల స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ టీవీ లేటెస్ట్ ఇంటర్‌ఫేస్ డిజైన్ కలిగి ఉంది.
అమెజాన్ సేల్‌లో 65శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 13,499కి తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ లిస్టులో మీరు కొనుగోలు చేసేందుకు ఇతర బ్రాండ్ల టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పుడే కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు.