Amazon Prime Day 2026 Sale : గెట్ రెడీ గాడ్జెట్ లవర్స్.. జూలై 4 నుంచి షాపింగ్ జాతర.. ఈ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు..!

Amazon Prime Day 2026 Sale : అమెజాన్ కస్టమర్ల కోసం అద్భుతమైన సేల్ రాబోతుంది. వచ్చే జూలై 4 నుంచి ఈ కొత్త సేల్ ప్రారంభం కానుంది.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై ఖతర్నాక్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు ఉండనున్నాయి.

Amazon Prime Day 2026 Sale

  • జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026
  • మొత్తం 3 రోజుల పాటు కొనసాగనున్న సేల్
  • స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్

Amazon Prime Day 2026 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ కొనేందుకు చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌ తేదీలు వెల్లడయ్యాయి. భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రైమ్ డే సేల్ జూలై 4న అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుంది. జూలై 6 రాత్రి 11:59 వరకు ఈ సేల్ కొనసాగనుంది.

మొత్తం 3 రోజుల పాటు జరిగే ఈ మెగా సేల్‌లో ప్రైమ్ సభ్యులకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, హోమ్ అప్లయెన్సెస్ సహా పలు కేటగిరీల్లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి సేల్ సందర్భంగా 500కు పైగా కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫర్లను కూడా ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఎస్బీఐ, యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ సేవింగ్స్ లభించనున్నాయి. అదేవిధంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉండనుంది.

స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ :
గాడ్జెట్ ప్రియుల కోసం ఇప్పటికే కొన్ని డీల్స్‌ను అమెజాన్ వెల్లడించింది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చే వన్ ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్‌తో రూ.49,999కి లభించనుంది. 7,540mAh బ్యాటరీతో రెడ్‌మి టర్బో 5 5జీ ఫోన్ రూ.34,999కి, 50MP సోనీ ఏఐ కెమెరాతో ఐక్యూ జెడ్10 లైట్ రూ.13,999కి అందుబాటులోకి రానున్నాయి. హెచ్‌పీ విక్టస్ రైజెన్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్, నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్, 16GB ర్యామ్, 512GB SSDతో రూ.79,990 ధరకు లభించనుంది.

Read Also : itel Power 451 Launch : వారెవ్వా.. స్మార్ట్‌ఫోన్‌ రేంజ్ ఫీచర్లతో కొత్త ఐటెల్ AI ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర జస్ట్ రూ. 1,699కే..

ఇక హోమ్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో IFB 9kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ.32,990కి, అక్వాగార్డ్ డిలైట్ ఆక్వాసేవర్ వాటర్ ప్యూరిఫైయర్ రూ.11,999కి, ఫైర్ టీవీ స్టిక్ HD రూ.2,999కి అందుబాటులో ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు, ఎకో డివైజ్‌లు, ఫైర్ టీవీ ప్రొడక్టులపై 45 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి.

ఈసారి అమెజాన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఫీచర్లను కూడా కంపెనీ అందించనుంది. రెఫ్యూస్, లెన్స్ ఏఐ, ఏఐ రివ్యూ హైలెట్స్, క్విక్ వ్యూ, బైయింగ్ గైడ్స్ వంటి టూల్స్ ద్వారా కస్టమర్లు ప్రొడక్టులను ఈజీగా సెర్చ్ చేసి కంపేర్ చేసి కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్ ప్రైమ్ ఇండియాలో 10 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వార్షిక సభ్యత్వంపై రూ.500 డిస్కౌంట్ అందించనుంది. కొత్తగా జాయిన్ అయిన ప్రైమ్ మెంబర్లకు రూ.999కే వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్, రూ.299కి ప్రైమ్ షాపింగ్ ఎడిషన్, ప్రైమ్ లైట్ ప్యాకేజీని రూ.599కి అందించనుంది. ప్రైమ్ సభ్యులకు ఫాస్ట్ డెలివరీ, స్పెషల్ సేల్ యాక్సెస్, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా అందనున్నాయి.