×
Ad

Apple Diwali Offers : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 17 సిరీస్, మ్యాక్‌బుక్స్, ఎయిర్‌పాడ్స్, వాచ్‌‌లపై బంపర్ డిస్కౌంట్లు..!

Apple Diwali Offers : దీపావళి పండగ సేల్ ఆఫర్లను ఆపిల్ ప్రకటించింది. ఐఫోన్లు సహా పలు ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Apple Diwali Offers

Apple Diwali Offers : పండగ సీజన్ మొదలైంది.. ఆన్‌లైన్ సేల్స్ ఆఫర్లు, డిస్కౌంట్ల జాతర నడుస్తోంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీపావళి కూడా దగ్గర పడుతుండటంతో ఆపిల్ భారతీయ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లను ప్రకటించింది. లేటెస్ట్ ఆపిల్ ఐఫోన్లకు అప్‌గ్రేడ్ చేసుకునే వినియోగదారులకు అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

ప్రధానంగా ఐఫోన్ 17 లైనప్, మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఆపిల్ వాచ్ (Apple Diwali Offers) మోడళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో పాటు ట్రేడ్-ఇన్ బెనిఫిట్స్ కూడా అందించనుంది. పండుగ ప్రమోషన్లలో భాగంగా ఆపిల్ ఇప్పుడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

ఇందులో టాప్ డిస్కౌంట్ మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రో మోడళ్లకు వర్తిస్తుంది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ రూ.5వేలు క్యాష్‌బ్యాక్‌తో వస్తాయి. కస్టమర్లు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లతో పాటు పేమెంట్లను పొందవచ్చు. చాలా ప్రధాన బ్యాంకులలో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఈఎంఐ ఆప్షన్లు ఐఫోన్ 17 సిరీస్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఆపిల్ వాచ్ మోడళ్లకు వర్తిస్తాయి. అయితే, ఆపిల్ 9 నెలలు లేదా 12 నెలల ఈఎంఐ ఆప్షన్లు అక్టోబర్ 23, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Read Also : Flipkart iPhone 16 Orders : ఐఫోన్ కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో రద్దు అవుతున్న ఆపిల్ ఐఫోన్ 16 ఆర్డర్లు.. ఇదో పెద్ద స్కామ్ అంటున్న కొనుగోలుదారులు..!

ఈ ఆఫర్లు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, ఆపిల్ స్టోర్ యాప్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణేలోని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అధీకృత రీసేలర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. అయితే, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ బెనిఫిట్స్ పొందాలంటే ఎడ్యుకేషన్ స్టోర్ ధర లేదా కార్పొరేట్ ఎంప్లాయీ పర్చేజ్ ప్లాన్ వంటి ఇతర ఆఫర్‌లతో వర్తించదని ఆపిల్ పేర్కొంది.

ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్స్ ధరలు ఇలా ఉన్నాయి :

  • ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ.1,34,900
  • ఐఫోన్ ఎయిర్ రూ.1,19,900
  • ఐఫోన్ 17 రూ.82,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ.46,900
  • ఆపిల్ వాచ్ SE 3 ధర రూ.25,900
  • ఆపిల్ వాచ్ అల్ట్రా 3 ధర రూ.89,900.
  • ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ధర రూ.25,900
  • ఎయిర్‌పాడ్స్ 4 ధర రూ.17,900
  • ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ధర రూ.59,900