iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఇలా కొన్నారంటే జస్ట్ రూ. 30వేలు లోపే.. డోంట్ మిస్!

Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేయొద్దు.. ఇప్పుడే కొనేసుకోండి..

Apple iPhone 14

Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ధర మళ్లీ తగ్గిందోచ్. ఈ ఐఫోన్ ఇప్పుడు రూ.50వేల కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్ సేల్ సమయంలో భారీ తగ్గింపు (Apple iPhone 14) ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ 14 మోడల్ లాంచ్ ధర కన్నా రూ.30వేల వరకు తక్కువ ధరకు లభిస్తోంది.

సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కావడానికి ముందే ధర తగ్గింపు పొందింది. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 17 వరకు జరిగే ఈ సేల్‌లో ఐఫోన్ 14 అన్ని వేరియంట్‌లపై తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 14 : ఐఫోన్ 14 ధర తగ్గింపు :

ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ 3 స్టోరేజ్ (128GB, 256GB, 512GB) వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఐఫోన్ 14 రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు రూ. 59,900కు అమ్ముడవుతోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 52,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

అదనంగా, రూ.4,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అసలు లాంచ్ ధర కన్నా దాదాపు రూ.31వేలు తగ్గింపు ధరకే పొందవచ్చు. ఇతర బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కేవలం రూ.1,863 ఈఎంఐతో ఫోన్‌ ఇంటికి తెచ్చుకోవచ్చు.

Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు ఇవే..!

ఐఫోన్ 14 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.1-అంగుళాల సూపర్ రెటినా
ప్రాసెసర్ : A15 బయోనిక్
కెమెరా : 12MP + 12MP, 12MP
స్టోరేజీ : 128GB, 256GB, 512GB
ఆపరేటింగ్ సిస్టమ్ : iOS 16

2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14, ట్రెడేషనల్ నాచ్ డిజైన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. ఐఫోన్ బ్యాక్ సైడ్ రెండు 12MP లెన్స్‌లతో డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఐఫోన్ 6GB ర్యామ్, A15 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. iOS 18కి అప్‌గ్రేడ్ చేయొచ్చు.