Apple M4 MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కావాలా..? ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple M4 MacBook Air : ఆపిల్ కొత్త M4 మ్యాక్‌బుక్ ఎయిర్ విజయ్ సేల్స్ ద్వారా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple M4 MacBook Air

Apple M4 MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆపిల్ లేటెస్ట్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ (Apple M4 MacBook Air) లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 17వేలు భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అల్ట్రా-సన్నని అల్ట్రా-పోర్టబుల్ ల్యాప్‌టాప్ సొంతం చేసుకోవచ్చు.

మీరు ఏదైనా వర్క్, ఫొటో ఎడిటింగ్, గేమింగ్ లేదా వీడియో రెండరింగ్ కోసం ఈ ల్యాప్‌టాప్ అద్భుతంగా ఉంటుంది. ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 99,900 ఉండగా, రూ. 17వేలు డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

విజయ్ సేల్స్‌పై M4 మ్యాక్‌బుక్ ఎయిర్ డీల్ :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ 13-అంగుళాలు ఉంటుంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ.92,900 ధరకు లిస్ట్ అయింది. లాంచ్ ధరపై రూ.7వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, కస్టమర్లు ఎస్బీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.10వేలు ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ.82,900కి తగ్గుతుంది. మీరు రూ.3,832 నుంచి ప్రారంభమయ్యే 24 నెలల వరకు ఈఎంఐ కూడా ఎంచుకోవచ్చు.

Read Also : ITR Filing Rules : ఐటీఆర్ కొత్త రూల్స్.. ఇకపై మీ ఆదాయం తక్కువ ఉన్నా ITR ఫైల్ చేయాల్సిందే.. ఈ 8 సందర్భాల్లో తప్పనిసరి..!

M4 మ్యాక్‌బుక్ ఎయిర్ స్పెసిఫికేషన్లు :
ఈ మ్యాక్‌‌బుక్ 13-అంగుళాలు, 15-అంగుళాలు అనే రెండు సైజులలో లభిస్తుంది. అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ను లిక్విడ్ రెటినా డిస్‌ప్లే కలిగి ఉంది. 500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ మ్యాక్‌బుక్ మాగ్‌సేఫ్ ఛార్జింగ్, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లకు సపోర్టు ఇస్తుంది.

12MP సెంటర్ స్టేజ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫ్రేమ్‌ను ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది. వీడియో కాల్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ లేటెస్ట్ సిరి అప్‌డేట్‌లను అందిస్తుంది.

వాయిస్, టెక్స్ట్ కమాండ్‌ల మధ్య ఈజీగా మారవచ్చు. మీరు (Siri)ని వేలాది మ్యాక్-సంబంధిత ప్రశ్నలను అడగవచ్చు. దశల వారీ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. సిరి, రైటింగ్ టూల్స్‌లో ChatGPT ఇంటిగ్రేషన్ ద్వారా ఏఐ-ఆధారిత అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా, 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.