Apple MacBook Air 2025 : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఆపిల్ ప్రొడక్టులు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. ఇందులో ఐఫోన్లు, ఐప్యాడ్‌లు లేదా మ్యాక్స్ ప్రతిదీ తగ్గింపు ధరకు పొందవచ్చు. ఇప్పుడు, మీరు లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 2025 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2/6
అమెజాన్‌లో ఆపిల్ 2025 మ్యాక్‌బుక్ ఎయిర్ డీల్ : అమెజాన్ ఇండియాలో ఆపిల్ 2025 మ్యాక్‌బుక్ ఎయిర్ 13-అంగుళాల వేరియంట్ ధర రూ.83,900కు అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.99,900 నుంచి దాదాపు రూ.17వేలు తగ్గింపు అందిస్తోంది.యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర ఎంపిక చేసిన కార్డులపై రూ.3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
3/6
తద్వారా ల్యాప్‌టాప్ ధర రూ.80,990కి తగ్గుతుంది. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ స్కై బ్లూ, సిల్వర్, మిడ్ నైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. మీ పాత ల్యాప్‌టాప్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడే కొత్త మ్యాక్‌బుక్ కొనేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.
4/6
ఆపిల్ 2025 మ్యాక్‌బుక్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ మ్యాక్‌బుక్ 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఒక బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది. ఇందులో 16GB యూనిఫైడ్ మెమరీ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ SSD ఆప్షన్ కూడా పొందవచ్చు. ఈ మ్యాక్‌బుక్ అందించే పోర్ట్‌లలో మ్యాగ్‌సేఫ్ 3 ఛార్జింగ్ పోర్ట్, రెండు థండర్‌బోల్ట్ 4 USB-C పోర్ట్‌లు, USB 4, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
5/6
ఆపిల్ 2025 మ్యాక్‌బుక్ ఎయిర్ హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కలిగిన ఆపిల్ M4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా, ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా అందిస్తుంది.
6/6
బ్యాటరీ విషయానికి వస్తే.. ఆపిల్ 2025 మ్యాక్‌బుక్ ఎయిర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 18 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. 30W డ్యూయల్ USB-C పవర్ అడాప్టర్‌తో 53.8W లిథియం-పాలిమర్ బ్యాటరీతో పవర్ అందిస్తుంది.