Apple MacBook Air M5 : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 భారీగా తగ్గిందోచ్.. ఫుల్ ఛార్జ్ చేస్తే 18 గంటల బ్యాటరీ లైఫ్, అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Apple MacBook Air M5 : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే? ఫుల్ డిటెయిల్స్

Apple MacBook Air M5

  • అమెజాన్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 భారీ డిస్కౌంట్
  • 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్
  • రూ. 7వేల వరకు డిస్కౌంట్, ఫుల్ ఛార్జ్ 18 గంటల బ్యాటరీ లైఫ్‌

Apple MacBook Air M5 : కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు మల్టీటాస్కింగ్ ఇష్టపడేవారైతే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికోసం ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ల్యాప్‌టాప్ చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5పై అదిరిపోయే డీల్ అందిస్తోంది. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి చూద్దాం..

అమెజాన్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 డీల్ :
ఆపిల్ 2026 మ్యాక్‌బుక్ ఎయిర్ M5 13-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 1,39,900 నుంచి తగ్గింది. అమెజాన్ ఇండియాలో రూ. 1,34,990కే అందుబాటులో ఉంది.

అంతేకాదు.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో వినియోగదారులందరూ ఈ డివైస్‌పై రూ. 7వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డివైస్ స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్టోరేజ్ వేరియంట్ 1TB SSD వేరియంట్ కూడా ఉంది.

Read Also : Samsung Phone Prices : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోన్ల ధరలు.. ఇంత చౌకగా మళ్లీ దొరకవు!

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5, 500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఆపిల్ M5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మ్యాక్‌బుక్ 16GB యూనిఫైడ్ మెమరీతో పాటు 1TB SSD కూడా ఉంది.

వీడియో కాల్స్, మీటింగ్‌ కోసం ఇందులో 1080p ఫేస్‌టైమ్ HD కెమెరా ఉంది. ఆడియో కోసం ఈ ల్యాప్‌టాప్‌లో స్పేషియల్ ఆడియోతో క్వాడ్ స్పీకర్ ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లు, మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 సుమారు 1.24 కిలోల బరువు ఉంటుంది. సన్నని ఛాసిస్‌ అందిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 18 గంటల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది.