×
Ad

Apple Borivali Store : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. భారత్‌కు 6వ స్టోర్ వచ్చేస్తోంది.. ఈసారి ఎక్కడ? ప్రత్యేకతలేంటో తెలుసా?

Apple Borivali Store : ఆపిల్ ఇండియాలో ఆరవ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఇటీవలే నోయిడాలో 5వ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించింది. ముంబైలో ఇప్పటికే ఒక స్టోర్ ఉండగా ఇప్పుడు రెండో ఆపిల్ స్టోర్ ప్రారంభం కానుంది.

  • Published On : February 13, 2026 / 02:57 PM IST

Apple New Store

  • బోరివలిలో స్కై సిటీ మాల్‌లో ఈ నెల 26న ఆపిల్ 6వ స్టోర్ ప్రారంభం
  • ఇండియా స్టోర్ లాంచ్‌లలో ఆపిల్ నెమలి డిజైన్ థీమ్‌
  • ఆపిల్ ట్రైనింగ్ సెషన్‌లలో ప్రొడక్టు డెమోలు, నిపుణుల సపోర్టు, ఫ్రీ టుడే యాక్సెస్

Apple New Store : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు మరో కొత్త ఆపిల్ స్టోర్ రాబోతుంది. అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్లో వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 5 స్టోర్లను ఏర్పాటుచేసిన ఆపిల్ ఇప్పుడు 6వ స్టోర్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

కంపెనీ ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 5వ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ డిసెంబర్ 11, 2025న ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా 6వ స్టోర్ ప్రారంభించేందుకు టెక్ దిగ్గజం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మెరుగైన కస్టమర్ ఎక్స్ పీరియన్స్ అందించడమే కాకుండా ట్రైనింగ్ సెషన్‌లను అందించే లక్ష్యంతో ఈ నెల చివరి వారంలో కొత్త ఆపిల్ స్టోర్ ప్రారంభించనుంది. కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం కొత్త 6వ స్టోర్ బారికేడ్ డిజైన్‌ కూడా వెల్లడించింది. నెమలి మాదిరి విజువల్ థీమ్‌ ఆకర్షణీయంగా ఉంది. ఈ డిజైన్ ముందుగా బెంగళూరు, పూణేలోని ఆపిల్ 2025 స్టోర్ ప్రారంభోత్సవాలలో ఆ తర్వాత నోయిడా ప్రదేశంలో చూశారు.

ఆపిల్ బోరివాలి స్టోర్ తేదీ, లొకేషన్ వివరాలివే :
ముంబైలో ఈ కొత్త ఆపిల్ స్టోర్ ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 1 గంటలకు అధికారికంగా ప్రారంభం కానుంది. లొకేషన్, ఇతర వివరాలు పూర్తి రివీల్ చేయలేదు. ముంబైలోని ఒబెరాయ్ రియాలిటీ కాంప్లెక్స్‌లోని బోరివాలి (తూర్పు)లోని స్కై సిటీ మాల్‌లో ప్రారంభం కానుందని ముందస్తు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త స్టోర్ 12,616 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ ఆపిల్ 6వ స్టోర్ అద్దె వివరాలు రివీల్ చేయలేదు.

Read Also : Croma Valentine Day Sale : వాలెంటైన్స్ డే సేల్.. ఈ ఆపిల్ ఐఫోన్ 17పై ఖతర్నాక్ డిస్కౌంట్, జస్ట్ రూ. 47వేలకే, ఎలాగంటే?

కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి? :

ఈ ఆపిల్ స్టోర్ బోరివలి ప్రాంతంలో ప్రారంభం కానుంది. ముంబైలో ఇప్పటికే ఒక ఆపిల్ స్టోర్ ఉండగా, ఇప్పుడు రెండో స్టోర్ ప్రారంభం కానుంది. వ్యవస్థాపకులు, స్టార్టప్‌లు, వ్యాపారాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. కస్టమర్లు ఆపిల్ లేటెస్ట్ ప్రొడక్టులను ఈజీగా పొందవచ్చు. ఈ స్టోర్ నుంచి నిపుణులు, క్రియేటివ్‌, జీనియస్‌ల వంటి ఇన్-స్టోర్ టీం నుంచి పర్సనలైజడ్ అసిస్టెన్స్ పొందవచ్చు. బిజినెస్ కస్టమర్లకు డెడికేటెడ్ సపోర్టు కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రొడక్టు సేల్స్, టెక్నాలజీ సపోర్టుతో పాటు స్టోర్ టుడే ఎట్ ఆపిల్ సెషన్‌ అందిస్తుంది. ఆపిల్ యూజర్లు కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. క్రియేటివిటీని పెంచుకోవచ్చు. రోజువారీ ఉచిత వర్క్‌షాప్‌లు కూడా ఉంటాయి.

బోరివలి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఆపిల్ స్టోర్ యాప్, ఐఓఎస్ యూజర్ల కోసం ఆపిల్ పికప్, ట్రేడ్ ఇన్, పర్సనల్ సెటప్, స్విచింగ్ సపోర్ట్ వంటి సర్వీసులను అందిస్తుంది. స్టోర్ ప్రారంభానికి ముందే ఆపిల్ ముంబై నుంచి స్పెషల్ వాల్‌పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఆపిల్ మ్యూజిక్ ప్లేలిస్టును కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.