Audi A6 e-tron : ఒక్క ఛార్జ్‌తో 1,338 కి.మీ.! ఆడి A6 ఇ-ట్రాన్ సంచలనం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
Audi A6 e-tron : ఆడి A6 ఇ-ట్రాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. సింగిల్ ఛార్జ్ ద్వారా ఏకంగా 1,338 కిలోమీటర్లు దూసుకెళ్లింది. ఛార్జింగ్ కోసం ఎక్కడ ఆగకుండా ముందుకు సాగింది. చివరికి అనుకున్న టార్గెట్ పూర్తి చేసింది.
- Sreehari A
- Published on- September 27, 2026 / 08:22 PM IST
Audi A6 e-tron, Guinness World Record, Audi A6 WLTP
- గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించే ప్రయత్నంలో రికార్డు
- ఆడి A6 ఇ-ట్రాన్‌ను ఛార్జింగ్ కోసం ఎక్కడా ఆగలేదు
- ఈ ఘనతను పోలిష్ ర్యాలీ డ్రైవర్ మికో మార్జిక్ సాధించారు
Audi A6 e-tron : ఎలక్ట్రిక్ కార్ల రేంజ్‌పై అంచనాలను తలకిందులు చేస్తూ ఆడి A6 ఇ-ట్రాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక్కసారి కూడా రీఛార్జ్ చేయకుండా ఏకంగా 1,338 కిలోమీటర్లు ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అసాధారణ ప్రయాణాన్ని పోలిష్ ర్యాలీ డ్రైవర్ మికో మార్జిక్ పూర్తి చేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం సెప్టెంబర్ 11న ఈ డ్రైవ్ ప్రారంభమైంది. పోలాండ్‌లోని టోరున్–సిచోసినెక్ మధ్య సాగింది. దాదాపు 45 గంటల పాటు కొనసాగిన ఈ ప్రయాణంలో కారు ఎక్కడా ఛార్జింగ్ కోసం ఆగలేదు. క్రాకోవ్, సాండోమియెర్జ్, వార్సా, గ్రుడ్జియాడ్జ్ వంటి నగరాలను దాటుతూ అదే మార్గంలో తిరిగి ప్రయాణించింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..
సాధారణంగా రేసింగ్ డ్రైవర్లు వేగం కోసం పోటీపడతారు. కానీ, మికో లక్ష్యం మాత్రం గరిష్ఠ సామర్థ్యంపైనే ఫోకస్ పెట్టింది. రద్దీగా ఉన్న ట్రాఫిక్, మారుతున్న వాతావరణ పరిస్థితులు వంటి సాధారణ రహదారి పరిస్థితుల్లోనే ఈ ప్రయాణం సాగింది.
Read Also : Electronics Price Hike : పండగకు ముందే బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి AC, TV, ఫ్రిజ్ ధరలకు రెక్కలు!
ఆడి A6 ఇ-ట్రాన్ (WLTP) ప్రకారం.. సుమారు 777 కి.మీ. రేంజ్ అందిస్తుంది. కానీ, ఈ రికార్డు ప్రయాణంలో అది ఏకంగా 1,338 కి.మీ. దూసుకెళ్లింది. అంటే అధికారిక రేంజ్ కంటే 561 కి.మీ. ఎక్కువ అనమాట. ఈ ప్రయాణంలో మికో ప్రతి 100 కిలోమీటర్లకు కేవలం 7.09 kWh విద్యుత్‌ను వినియోగించినట్లు ఆడి తెలిపింది. 100kWh బ్యాటరీలో 94.9 kWh ఉపయోగించగల సామర్థ్యం ఉంది.
అనవసరమైన యాక్సిలరేషన్, బ్రేకింగ్‌ను తగ్గించడం, టైర్ ప్రెజర్‌ను బ్యాలెన్స్ చేయడం, రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను సమర్థంగా వాడటం ద్వారా మికో సామర్థ్యాన్ని పెంచారు. కారులోని ఏరోడైనమిక్ డిజైన్, బ్యాటరీ టెక్నాలజీ కూడా ఈ అద్భుతమైన ఫలితానికి తోడయ్యాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. రేంజ్ ఎంత అన్నదే కాదు.. దాన్ని ఎలా వాడమన్నదే అసలు విషయం.. ఆడి A6 ఇ-ట్రాన్ ఇదే నిరూపించింది.
