Bank Holiday : మీకు బ్యాంకులో పని ఉందా? ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే.. మీ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు ఉందా? ఇలా తెలుసుకోండి!

Bank Holiday: 2026 ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే రోజున దేశంలోని చాలా ప్రాంతాలలో బ్యాంకులు మూతపడతాయి. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. తద్వారా వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుకోవచ్చు.

Bank Holiday

  • ఏప్రిల్ 3న బ్యాంకులు తెరిచి ఉంటాయా? సెలవు ఉందా?
  • గుడ్ ఫ్రైడే రోజున చాలా బ్యాంకులకు హాలిడే
  • రాష్ట్రీల వారీగా బ్యాంకుల సెలవులు ఇవే

Bank Holiday : మీకు బ్యాంకులో పని ఉందా? ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే.. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటే ఇది మీకోసమే.. 2026 ఏప్రిల్ 3న దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడతాయి.

ప్రతి ఏడాదిలో ఈస్టర్‌కు ముందు ఏసుక్రీస్తు శిలువ వేసిన దినంగా స్మరించుకుంటూ జరుపుకుంటారు. ఈ రోజుకు మతపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. సంతాపం, ప్రార్థన, ఆత్మపరిశీలన సమయంగా పాటిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజును సెలవుల జాబితాలో చేర్చింది.

ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవంటే? :
ఏప్రిల్ 3న దేశవ్యాప్తంగా పలు ప్రధాన రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకు శాఖలు మూతపడతాయి. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

Read Also : HRA Tax Relief : జీతగాళ్లకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్ సహా 4 నగరాల్లో 50శాతం HRA.. చేతికి ఎంత జీతం వస్తుందంటే?

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది. మీరు బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తే ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.

ఏప్రిల్‌లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి. అంబేడ్కర్ జయంతి, అలాగే పలు ప్రాంతీయ పండుగల కారణంగా ఏప్రిల్ 14న దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మూతపడతాయి. బిహు, విషు, బెంగాలీ నూతన సంవత్సరం వంటి పండుగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ఏప్రిల్ 15, 16 తేదీలలో కూడా బ్యాంకులు మూతపడతాయి.

కర్ణాటకలో బసవ జయంతి సందర్భంగా ఏప్రిల్ 20న, త్రిపురలో గరియా పూజ సందర్భంగా ఏప్రిల్ 21న కూడా బ్యాంకులు మూతపడతాయి. ఏప్రిల్ 5, ఏప్రిల్ 12, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తేదీలలోని ఆదివారాల్లో బ్యాంకులు మూతపడతాయి. అలాగే, ఏప్రిల్ 11, ఏప్రిల్ 25 తేదీలలోని రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులు మూతపడతాయి.

ఆన్ లైన్ సేవలు పనిచేస్తాయి :
బ్యాంకు శాఖలు మూతపడినా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పనిచేస్తాయి. నేటి డిజిటల్ యుగంలో చాలా బ్యాంకింగ్ పనులు ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు.