Bank Holiday On Makar Sankranti
Bank Holiday On Makar Sankranti : మకర సంక్రాంతి 2025 నాడు బ్యాంకులకు సెలవు ఉందా? సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14, 2025 మంగళవారం మకర సంక్రాంతిని జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు.
Read Also : Gold Rate: భోగి పండగ వేళ మహిళలకు బిగ్ షాక్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
ఈ సందర్భంగా పిల్లల నుంచి పెద్దల వరకు గాలిపటం ఎగురవేయడం, నువ్వుల మిఠాయిలు తయారు చేసి ఆరగించడం వంటి ఆనందకరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో గడుపుతారు. అయితే, ఈ పండుగ రోజున బ్యాంకులు పనిచేస్తాయా? లేదా అనేది సందేహం తలెత్తుతుంది. ఈ రోజున బ్యాంకులు తెరిచే ఉంటాయా? లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి 2025న బ్యాంకులకు సెలవులు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో జనవరి 14న బ్యాంకులు మూతపడనున్నాయి. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల, పొంగల్, మాఘే సంక్రాంతి, మాగ్ బిహు, హజ్రత్ అలీ పుట్టినరోజు వంటి వివిధ పేర్లతో జరుపుకునే పండుగలకు కూడా బ్యాంకులు పనిచేయవు.
ఈ కింది నగరాల్లోని బ్యాంకులు జనవరి 14న మూతపడతాయి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాలలో బ్యాంకులు జనవరి 13, జనవరి 14 రెండింటిలోనూ తెరిచి ఉంటాయి, ఎందుకంటే.. ఈ తేదీలు ఆర్బీఐ అధికారిక క్యాలెండర్‌లో సెలవులుగా జాబితా ఉండదు. దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో బ్యాంకింగ్ సర్వీసులు కూడా ప్రభావితం కావు. అదనంగా, 2025 జనవరిలో చివరి వారంలో బ్యాంకు సెలవుదినం ఉంటుంది. జనవరి 23న కోల్‌కతా, భువనేశ్వర్, అగర్తలాల్లోని బ్యాంకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు, వీర్ సురేంద్రసాయి జయంతి సందర్భంగా మూతపడతాయి.
భారత్‌లో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఆర్బీఐచే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం ఏటా ఆయా రాష్ట్రాల్లో సెలవులను ప్రకటిస్తారు. చెక్కులు, ప్రామిసరీ నోట్లతో కూడిన లావాదేవీలు ఈ సెలవుల్లో ప్రాసెస్ చేయరని గమనించాలి.
ఏదేమైనప్పటికీ, బ్యాంకులు మూతపడిన రాష్ట్రాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు, ఏటీఎంలు పనిచేస్తాయి, ఖాతాదారులు అవసరమైన ఆర్థిక లావాదేవీల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లే కస్టమర్లు ముందుగా ప్రాంతీయ సెలవుల షెడ్యూల్‌లను చెక్ చేసి ప్లాన్ చేసుకోవాలి.