Bank Holidays Alert : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా 4 రోజులు సేవలు బంద్! ముందే ఇలా ప్లాన్ చేసుకోండి
Bank Holidays Alert : వచ్చే వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె, గాంధీ జయంతి నేపథ్యంలో బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్..
- Sreehari A
- Updated on- September 27, 2026 / 09:57 PM IST
Bank Holidays Alert
- బ్యాంక్ పనులున్నాయా? 4 రోజుల సెలవులు
- వచ్చే వారం ఈ తేదీల్లో బ్రాంచ్‌కు వెళ్లొద్దు
- బ్యాంకులు మూసివేత, డిజిటల్ సేవలపై క్లారిటీ
Bank Holidays Alert : బ్యాంకులో మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందా? క్యాష్ కావాలా? చెక్కు డిపాజిట్ చేయాల్సి ఉందా? అయితే ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. వచ్చే వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.
ఈ తేదీల్లో సేవలకు అంతరాయం :
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలు పనిచేయవు. అయితే, ఈ ప్రభావం ప్రైవేట్ బ్యాంకులకు వర్తించదు. అనంతరం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Read Also : New Pension Facility : ఒక్క క్లిక్‌తో పెన్షన్ ఖాతా.. UPIతో చెల్లింపులు, మొబైల్‌లోనే అన్నీ..!
దీంతో బ్యాంకు శాఖలను నేరుగా వెళ్లి చేసే పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. క్యాష్ డిపాజిట్, చెక్ సంబంధిత పనులు, కొత్త ఖాతా ఓపెన్, డ్రాఫ్ట్‌లు, పాస్‌బుక్ అప్‌డేట్, లాకర్ సేవలు వంటి బ్రాంచ్ ఆధారిత కార్యకలాపాలు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.
డిజిటల్ సేవలు అందుబాటులో :
బ్యాంకు బ్రాంచ్‌లు మూసినా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా అవసరమైన లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే ఆర్బీఐ వ్యవస్థలో RTGS, NEFT వంటి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవలు 24×7 అందుబాటులో ఉంటాయి.
అయితే, ఎమర్జెన్సీ క్యాష్ లేదా బ్రాంచ్‌లోనే పూర్తయ్యే పనులు ఉన్నవారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. సెలవుల ప్రభావం బ్యాంకు, ప్రాంతం, సర్వీసు ఆధారంగా మారే అవకాశం ఉంది. మీకు సమీపంలోని సంబంధిత బ్యాంకు అధికారిక సమాచారాన్ని ముందే తెలుసుకోండి.
