New Pension Facility : ఒక్క క్లిక్‌తో పెన్షన్ ఖాతా.. UPIతో చెల్లింపులు, మొబైల్లోనే అన్నీ..!
New Pension Facility : అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక పెన్షన్ ఖాతా తీసుకురావడంపై PFRDA పరిశీలిస్తోంది. ఈ-శ్రమ్ వివరాలతో డిజిటల్‌గా ఖాతా తెరిచేందుకు చూస్తోంది. యూపీఐ చెల్లింపులు వంటి సౌకర్యాలపై పూర్తి వివరాలివే..
New Pension Facility
- పెన్షన్ కోసం PFRDA కొత్త సదుపాయం
- అసంఘటిత కార్మికులకు అవకాశం
- ఈ-శ్రమ్ వివరాలతో డిజిటల్‌గా ఖాతా
- శాలరీ స్లిప్ లేకున్నా పెన్షన్ ఖాతా
New Pension Facility : పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. స్థిరమైన నెలవారీ ఆదాయం లేని అసంఘటిత రంగ కార్మికులు కూడా భవిష్యత్ కోసం పెన్షన్ ఫండ్ సమకూర్చుకునేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీనిపై పీఎఫ్ఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది.
ఈ-శ్రమ్ వివరాలతో :
ఒకవేళ ప్రతిపాదిత విధానం అమల్లోకి వస్తే.. ఈ-శ్రమ్‌లో రిజిస్టర్ అయిన కార్మికులకు డిజిటల్‌గా పెన్షన్ ఖాతా ప్రారంభించే అవకాశం లభించనుంది. ప్రత్యేకంగా శాలరీ స్లిప్‌లు లేదా సంప్రదాయ పేపర్‌వర్క్ అవసరం లేకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ప్రక్రియను ఈజీ చేయాలని భావిస్తున్నారు.
ఖాతా నిర్వహణ కూడా మొబైల్ ఫోన్ ద్వారానే జరిగేలా డిజిటల్ వ్యవస్థను రూపొందించే యోచనలో ఉంది. యూపీఐ ద్వారా చందా మొత్తాన్ని చెల్లించడం, ఖాతా వివరాలు పరిశీలించడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సదుపాయం ఇంకా ప్రతిపాదన, అభివృద్ధి దశలోనే ఉంది. ప్రస్తుతం ఎలాంటి లింకులు, యాప్‌లు లేదా వ్యక్తిగత వివరాలు అడిగే అనధికారిక వ్యక్తులను నమ్మకండి. OTP, UPI PIN, బ్యాంక్ వివరాలు ఇతరులతో షేర్ చేయొద్దు. అధికారిక మార్గదర్శకాలు విడుదలైన తర్వాతే ఖాతా ప్రారంభ ప్రక్రియ, అర్హతలు, చెల్లింపు నిబంధనలు వంటి అంశాలపై క్లారిటీ వస్తుంది.
ఇదే సమయంలో ఎన్పీఎస్ కింద ఆరోగ్య సంబంధిత అవసరాలకు ‘(NPS Swasthya)’పై కూడా కేంద్రం పనిచేస్తోంది. పెన్షన్ పొదుపులకు అనుసంధానంగా అదనపు బీమా రక్షణ కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన తుది నిబంధనలు, ప్రయోజనాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
