BoB UPI Payments : ఈ బ్యాంకు కస్టమర్లకు ఇక యూపీఐ పిన్ అక్కర్లేదు.. ఫింగర్ ఫ్రింట్, ఫేస్‌తోనే పేమెంట్లు చేయొచ్చు!
BoB UPI Payments : బ్యాంకు ఆఫ్ బరోడా యూపీఐ పేమెంట్లు చేసేవారికి అదిరిపోయే న్యూస్.. ఇకపై పిన్ అవసరం లేదు. మీ ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈజీగా పేమెంట్లు చేయొచ్చు.
- Sreehari A
- Published on- May 29, 2026 / 05:26 PM IST
BoB UPI Payments
- బ్యాంకు ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్ న్యూస్
- యూపీఐ పేమెంట్లకు పిన్ అవసరం లేదు
- ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా పేమెంట్లు
BoB UPI Payments : బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ పేమెంట్లు చేసేటప్పుడు మీ పిన్ ఎంటర్ చేయాల్సిన పనిలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ యాప్ బాబ్ ఇ పేలో అనేక కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఇకపై కస్టమర్లు ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.
రూ. 5వేల వరకు బయోమెట్రిక్ పేమెంట్లు :
బ్యాంకు ప్రకారం.. బాబ్ ఇ-పే యాప్ వాడే కస్టమర్లు మొబైల్ ఫోన్‌లో రిజిస్టర్ చేసుకున్న ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా రూ. 5వేల వరకు యూపీఐ పేమెంట్లను చేయొచ్చు. ఈ ఫీచర్ వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P),షాపు నుంచి మర్చంట్ (P2M)కు పేమెంట్లు రెండింటికీ అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్ చెకింగ్ కూడా చేయొచ్చు. అయితే, కస్టమర్లు అవసరమైతే తమ యూపీఐ పిన్‌ను కూడా వాడొచ్చు.
ఇప్పుడు ఫేస్‌తో యూపీఐ పిన్ సెట్ చేయొచ్చు :
బ్యాంకు యూపీఐ పిన్‌ను సెట్ చేయడం లేదా రీసెట్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ. కస్టమర్లు ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్, ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీని ఉపయోగించి తమ యూపీఐ పిన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. డెబిట్ కార్డు అవసరం ఉండదు. ఈ ప్రాసెస్ గతంలో కన్నా చాలా ఈజీగా ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ల ద్వారా పేమెంట్లు :
బ్యాంక్ ఐఓటి (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఆధారిత పేమెంట్లను కూడా ప్రారంభించింది. తద్వారా యూజర్లు కనెక్ట్ చేసిన కారు లేదా స్మార్ట్ డివైజ్ బాబ్ ఇ-పే యాప్‌కు లింక్ చేయడం ద్వారా నేరుగా పేమెంట్లు చేయవచ్చు.
