Best Electric Cars : రూ. 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో కొనాలా? లేక ఫుల్ పేమెంట్ బెటరా? కొనేముందు ఇవి గుర్తుంచుకోండి!

Best Electric Cars : సరసమైన ధరలో EV కోసం చూస్తున్నారా? ఈ ఎలక్ట్రిక్ కార్లు రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో కొన్ని 400 కి.మీ.లకు పైగా రేంజ్‌ అందిస్తాయి. మీరు రూ. 10 లక్షల వరకు బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే..

Best Electric Cars Under Rs 10 Lakh

  • రూ. 10 లక్షల బడ్జెట్‌లో మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కార్లు లభ్యం
  • టాటా టియాగో ఈవీ ఎంజీ విండ్సర్ ఈవీలో BaaS ఆప్షన్లు
  • రేంజ్, బ్యాటరీ, ఛార్జింగ్ BaaS నిబంధనలు బట్టి కొనేసుకోవచ్చు

Best Electric Cars : మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 10 లక్షల లోపు ఉంటే.. భారత మార్కెట్లో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధర రేంజ్‌లో హ్యాచ్‌బ్యాక్‌లు, మైక్రో ఈవీలు కాంపాక్ట్ ఎస్‌యూవీలు మరెన్నో ఉంటాయి. కొన్ని మోడళ్లను రూ. 10 లక్షల కన్నా తక్కువ ధరకే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్లతో కొనేసుకోవచ్చు. అందుకే, కారు ధర అనేది బ్యాటరీ కలిసి ఉంటుంది. మీరు ఎంచుకునే BaaS మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

BaaS సర్వీసు ఏంటి? :

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానంలో వినియోగదారులు కొత్త కారుకు, బ్యాటరీకి విడివిడిగా చెల్లిస్తారు. కారు ప్రారంభ ధర (Best Electric Cars) తగ్గుతుంది. కానీ, బ్యాటరీకి నెలవారీగా, సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో లేదా కిలోమీటరుకు విడిగా ఛార్జ్ అవుతుంది. అందుకే BaaS బ్యాటరీ, ఎక్స్-షోరూమ్ ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.

టాటా టియాగో ఈవీ :
భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ఈవీ ఒకటి. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది.

ఇందులో భారీ బ్యాటరీ ప్యాక్ 315కి.మీ వరకు MIDC రేంజ్‌ను అందిస్తుందని తెలిపింది. ధరను ఇంకా తగ్గాలంటే టియాగో ఈవీని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో కూడా కొనేసుకోవచ్చు. ఈ మోడల్‌లో బ్యాటరీకి విడిగా ధర చెల్లించాలి. ప్లాన్‌ బట్టి అదనపు ఛార్జీ వర్తిస్తుంది.

Read Also : Amazon Great Freedom Sale : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఫుల్ డిటెయిల్స్!

ఎంజీ కామెట్ ఈవీ :
ఎంజీ కామెట్ ఈవీ ధర సుమారుగా రూ.7.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 17.3kWh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుందని కంపెనీ పేర్కొంది. కాంపాక్ట్ సైజు, ఈజీ డ్రైవింగ్ కారణంగా రోజువారీ నగర రైడర్లకు అద్భుతమైన ఆప్షన్.

టాటా పంచ్ ఈవీ :
మీరు ఎస్‌యూవీ మాదిరి డిజైన్‌తో ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తుంటే టాటా పంచ్ ఈవీ బెస్ట్ ఆప్షన్. ఈ కారు ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. బేస్ వేరియంట్ 25kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 315 కిలోమీటర్ల వరకు రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పంచ్ ఈవీలో అనేక అడ్వాన్స్ సేఫ్టీ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ విండ్సర్ ఈవీ :
ఎంజీ విండ్సర్ ఈవీ సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షలకుపైగా ఉంది. అయితే, కంపెనీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో కూడా అందిస్తోంది. ప్రారంభ ధర రూ. 10 లక్షల కన్నా తక్కువకు వస్తుంది. ఈ మోడల్‌లోని బ్యాటరీకి కిలోమీటరుకు స్పెషల్ రుసుము లేదా సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. విండ్సర్ ఈవీ విశాలమైన క్యాబిన్, ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌కు బెస్ట్ ఆప్షన్.

కొనేముందు ఇవి గుర్తుంచుకోండి :

మీరు BaaS మోడల్‌ను ఎంచుకుంటే.. కేవలం కారు ప్రారంభ ధరపై మాత్రమే ఆధారపడొద్దు. అదనపు బ్యాటరీ ఛార్జీలు, నెలవారీ డ్రైవింగ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ వారంటీ, సర్వీస్ నెట్‌వర్క్‌ను చూసి ఎంచుకోండి. అయితే, బ్యాటరీతో సహా ఒకేసారి పేమెంట్ చేసి కొత్త కారు కొనాలనుకుంటే మాత్రం స్టాండర్డ్ ఎక్స్-షోరూమ్ ధర ఆప్షన్లు బట్టి తీసుకోండి.