×
Ad

Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత నెలకు వడ్డీనే రూ. 20,500 సంపాదించుకోవచ్చు!

Post Office Scheme : పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన స్కీమ్ అందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20వేలకు పైగా వడ్డీనే వస్తుంది.

Post Office Scheme

Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెడుతున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్ ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత చాలా మంది ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందుతారు. పదవీ విరమణ తర్వాత ఒక వ్యక్తి నెలవారీ ఆదాయం ఆగిపోతుంది. సంపాదించే పరిస్థితి ఉండదు. ఒకరిపై ఆధారపడాల్సి వస్తుంది. అవసరాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైన ఎలాంటి (Post Office Scheme) ఇబ్బంది లేకుండా జీవించాలంటే పోస్టాఫీసులో అనేక అద్భుతమైన పథకాలు ఉన్నాయి. అందులో పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. పోస్టాఫీస్ అందించే ఈ పథకం 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉంది.

మీరు పదవీ విరమణ తర్వాత అందుకున్న ఫండ్స్ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్టాఫీస్ ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ పథకంలో వడ్డీ ఆదాయం ఎంతంటే? :
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మీరు కేవలం రూ. 1,000 పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Read Also : BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటా, 72 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?

మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఒకేసారి రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. వార్షిక వడ్డీ రూ. 2,46,000 అందుతుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు త్రైమాసికానికి ఒకసారి చెల్లిస్తారు. రూ. 246,000 మొత్తాన్ని 3 నెలల్లో విభజిస్తే అది రూ. 61,500 అవుతుంది. తద్వారా ప్రతి 3 నెలలకు రూ. 61,500 వడ్డీని అందుకుంటారు. అప్పుడు మీకు నెలకు రూ. 20,500 అందుతుంది.

మెచ్యూరిటీ వ్యవధి ఎంతంటే? :
ఈ పథకంలో పెట్టుబడి పెట్టి ప్రతి 3 నెలలకు వడ్డీని విత్‌డ్రా చేసుకోకుంటే మీ ఫండ్ 5 ఏళ్ల తర్వాత సుమారు రూ. 4.2 మిలియన్లకు పెరుగుతుంది. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 5 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడితో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Disclaimer : మీ పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి.