BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటా, 72 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అతి చౌకైన ధరకే ప్లాన్ అందిస్తోంది. 72 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు..
BSNL Cheapest Plan
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అద్భుతమైన న్యూస్.. బీఎస్ఎన్ఎల్ అతి త్వరలో 5G సర్వీస్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ, ముంబైలలో బీఎస్ఎన్ఎల్ 5G సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ కంపెనీ ఇటీవలే భారత్ అంతటా ఒకేసారి 4G సర్వీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడేందుకు 4జీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై (BSNL Cheapest Plan) ఆధారపడి పనిచేస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు, జియో, ఎయిర్‌టెల్ కన్నా అత్యంత చౌకైనవి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తమ కస్టమర్లకు 4G నెట్‌వర్క్ అందిస్తోంది.
మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే.. మీకోసం అత్యంత సరసమైన ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ఎక్స్‌టెండెడ్ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ రోజుకు 2జీబీ డేటాతో 72 రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది.
బీఎస్ఎన్ఎల్ 72-రోజుల ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ చౌకైన 72-రోజుల ప్లాన్ ధర రూ. 485కు పొందవచ్చు. ఈ ప్లాన్ యూజర్లకు భారత్ అంతటా ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ ఫ్రీ నేషనల్ రోమింగ్‌తో సహా అనేక ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ యూజర్లు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కింద మొత్తం 144GB డేటాను పొందవచ్చు.
ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది. మొబైల్ యూజర్లందరికి BiTVకి ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్, OTT యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి రీఛార్జ్ నంబర్‌లపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది.
