Best Refrigerators : కొంటే ఇలాంటి ఫ్రిడ్జ్ కొనాలి.. రూ. 17వేల లోపు బెస్ట్ రిఫ్రిజిరేటర్లు.. ఇంటి కోసం ఏ ఫ్రిడ్జ్ కొనాలంటే?

Best Refrigerators : దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంటికి తప్పనిసరిగా మారింది. మీరు తక్కువ ధరలో కొత్త ఫ్రిడ్జ్ కొనాలని చూస్తుంటే అనేక ప్రముఖ బ్రాండ్‌లు రూ. 17వేల లోపు అద్భుతమైన మోడళ్లను అందిస్తున్నాయి.

Best Refrigerators 2026

  • రూ. 17వేల లోపు ధరలో సింగి డోర్ ఫ్రిజ్ లిస్టు ఇదిగో
  • తక్కువ బడ్జెట్లో మీకు నచ్చిన ఫ్రిడ్జ్ కొనేసుకోండి
  • ఈ సమ్మర్ సీజన్‌లో ఏ బ్రాండ్ ఫ్రిడ్జ్ తీసుకుంటే బెటర్?

Best Refrigerators : అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్‌లో చల్లగా ఏదైనా తీసుకోవాలంటే ఇంట్లో కచ్చితంగా రిఫ్రిజిరేటర్ ఉండాల్సిందే. సాధారణంగా వేసవిలో ఆహారపదార్థాలు బయటపెడితే తొందరగా పాడైపోతుంటాయి.

అందుకే ఇంట్లో మంచి ఫ్రిజ్ ఉండటం ఎంతైనా మంచిది. మీరు కూడా కొత్త ఫ్రిజ్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే. రూ. 17వేల లోపు ధరలో లభించే అనేక సింగిల్-డోర్ ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మంచి కూలింగ్, సరైన స్టోరేజ్ ఆప్షన్లతో పాటు మీ పవర్ బిల్లులు కూడా చాలా తక్కువగా వస్తాయి. ఏ ఫ్రిజ్ కొంటే బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హైయర్ 5 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ :
హైయర్ 190-లీటర్ల ఫ్రిజ్ చిన్న లేదా మధ్య తరహా కుటుంబాలకు సరిపోతుంది. పెద్ద కూరగాయల బాక్సు, స్ట్రాంగ్ గ్లాస్ అరలు, ఫాస్ట్ ఐస్ తయారయ్యే ఫీచర్ ఉన్నాయి. సుమారు గంటలో ఐస్ తయారవుతుంది. ప్రస్తుత డిస్కౌంట్లతో ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ. 15,290 వద్ద లభిస్తుంది.

శాంసంగ్ 4-స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ :
ఈ శాంసంగ్ 183-లీటర్ మోడల్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. తక్కువ పవర్ వినియోగించి ఎక్కువ కాలం పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఒకే టచ్‌తో డీఫ్రాస్ట్ అవుతుంది. ఇకపై పేరుకుపోయిన ఐస్ కరిగే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు సుమారు రూ. 16,990 ధరకు అమ్ముడవుతోంది. మీకు సౌండ్ లేకుండా పర్ఫార్మెన్స్ అందించేది కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్ కూలింగ్ అద్భుతంగా ఉంటుంది.

Read Also : Gold Price Today : ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం.. రాత్రికి రాత్రే గోల్డ్ ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

గోద్రెజ్ 5-స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ :
గోద్రెజ్ స్ట్రాంగ్ షెల్ఫ్‌లు, కూలింగ్‌తో స్టైలిష్ 185-లీటర్ల ఫ్రిజ్‌ను అందిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా 5 ఏళ్ల వారంటీతో వస్తుంది. కేవలం కంప్రెసర్‌పైనే కాకుండా మొత్తం ఫ్రిజ్‌పై వర్తిస్తుంది. మీకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఆన్‌లైన్ డీల్స్‌ ద్వారా సుమారుగా రూ. 16,490 ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

IFB 5-స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ :
కొంచెం ఎక్కువ స్పేస్ అవసరమైన వారికి IFB ఫ్రిడ్జ్ బెస్ట్ ఆప్షన్. 197-లీటర్ల ఫ్రిజ్ సామర్థ్యంతో వస్తుంది. ఇందులో ఇన్వర్టర్ కంప్రెసర్, హ్యుమిడిటీ కంట్రోలర్ ఉన్నాయి. పండ్లు కూరగాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతాయి. డిస్కౌంట్ల తర్వాత ఈ ఐఎఫ్‌బీ ధర సుమారు రూ. 16,490 నుంచి ప్రారంభమవుతుంది.

ఎక్కువ స్టోరేజీ కోసం, పండ్లు, కూరగాయలు స్టోర్ చేసేందుకు బెస్ట్ ఆప్షన్

వర్ల్‌పూల్ 3 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ :
తక్కువ ధరలో మంచి ఫ్రిజ్ కావాలంటే వర్ల్‌పూల్ 184-లీటర్ల మోడల్ చాలా చవకైనది. రూ. 13,990కు లభిస్తుంది. మంచి కూలింగ్, స్టోరేజ్ రెండూ లభిస్తాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాలలో ఫ్రీ ఇన్‌స్టాలేషన్ కూడా లభిస్తుంది.

మీ ఇంటి కోసం ఏ రిఫ్రిజిరేటర్ కొనాలి? :

  • మీకు మంచి డీల్ కావాలంటే హైయర్‌ను ఎంచుకోండి.
  • మంచి బ్రాండ్, సౌండ్ లేని పర్ఫార్మెన్స్ కోసం శాంసంగ్‌ తీసుకోండి.
  • మీకు గట్టి వారంటీ కావాలంటే గోద్రెజ్‌ను ఎంచుకోండి.
  • టాప్ స్టోరేజీ కోసం IFBని తీసుకోండి.
  • మీరు డబ్బు ఆదా కోసమైతే వర్ల్‌పూల్ తీసుకోవడం బెటర్.

మీరు ఏది ఎంచుకున్నా ప్రతి ఫ్రిజ్ వేసవిలో మీ వంటగదిలో అవసరానికి అనుగుణంగా ఎంచుకోండి. సైజుతో పాటు కెపాసిటీ, ​​వినియోగించే వాట్స్ ఆధారంగా ఉంటుంది.