Bestune Xiaoma Electric Car : ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1200 కి.మీ రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ కారు ధర జస్ట్ రూ. 3.47 లక్షలే.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు!

Bestune Xiaoma Electric Car : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి ఒక్కరూ సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారును కొనేందుకు చూస్తున్నారు. బెస్ట్‌ట్యూన్ మీకు తక్కువ ధరకే ఈవీ కారును అందిస్తోంది.

Bestune Xiaoma Electric Car

  • బెస్ట్‌ట్యూన్ షావోమీ సరసమైన ధరకే కొత్త ఎలక్ట్రిక్ కారు
  • అతి త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • సింగిల్ ఫుల్ ఛార్జ్ ద్వారా 1200 కిలోమీటర్ల రేంజ్

Bestune Xiaoma Electric Car : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అందుబాటు ధరలో ఎక్కువ కాలం మన్నిక ఉండే ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారు.

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బెస్టున్ మీ బడ్జెట్ ధరలోనే ఎలక్ట్రిక్ కారును అందిస్తోంది. 2023లో చైనాలో కొత్త మైక్రో-ఎలక్ట్రిక్ కారు ‘షావోమీ’ని లాంచ్ చేసింది. ఈ చిన్న కారు తక్కువ ధర, ఎక్కువ రేంజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తి స్టోరీ గురించి మరింత తెలుసుకుందాం..

రేంజ్ 1200 కి.మీ వరకు :
ఈ కారు అతిపెద్ద బలం రేంజ్. నివేదికల ప్రకారం.. స్టాండర్డ్ రేంజ్ సుమారు 800 కిలోమీటర్లు. అయితే, రేంజ్ ఎక్స్‌టెండర్ సిస్టమ్‌తో సింగిల్ పూర్తి ఛార్జ్‌పై 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సింగిల్ ఛార్జ్‌తో నగరంలో వారాల తరబడి ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మరే ఇతర కారు కూడా ఇంత తక్కువ ధరకు ఎక్కువ రేంజ్‌ అందించడం లేదు.

Read Also : EV Market Sales April : ఈవీ రంగంలో ఏప్రిల్ సేల్స్ సంచలనం.. టాటా, మహీంద్రా, బజాజ్ అగ్రస్థానం.. ఓలా ఎలక్ట్రిక్‌కు కష్టకాలం..!

ప్రారంభ ధర 3.47 లక్షలు :
చైనాలో ప్రారంభ ధర కేవలం 30,000 యువాన్లు (సుమారుగా రూ. 3.47 లక్షలు), కాగా అత్యంత ప్రీమియం మోడల్ 50వేల యువాన్లకు (సుమారుగా రూ. 5.78 లక్షలు) అందుబాటులో ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో భారీ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌పై ఆధారపడి ఉంటుంది. అద్భుతమైన ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో పవర్ విండోస్, డిజిటల్ క్లస్టర్ మ్యూజిక్ సిస్టమ్ వంటి అవసరమైన అన్ని ఫీచర్లు ఉన్నాయి.

డిజైన్ పరంగా, షావోమీ ఎంఐ 1000 స్టైలిష్‌గా కనిపిస్తుంది. పొడవు 3000mm, వెడల్పు 1510mm, హై ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలకు ఇరుకైన వీధులకు అనువుగా ఉంటుంది. దీని కాంపాక్ట్ సైజు ఉన్నప్పటికీ సీటింగ్ స్పేస్‌ అద్భుతంగా అమర్చారు. సేఫ్టీ కోసం కంపెనీ డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ వంటి ఫీచర్లను చేర్చింది.

భారత్‌లో ఎంట్రీ ఎప్పుడంటే? :
ఈ మైక్రో ఈవీ 20 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. వెనుక చక్రాలపై (రియర్ షాఫ్ట్) అమర్చారు. బ్యాటరీ LFP (లిథియం-ఐరన్ ఫాస్ఫేట్) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు వేగంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కంపెనీ సమీప భవిష్యత్తులో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, దేశీయ మార్కెట్లో లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.