×
Ad

Unclaimed Funds : బిగ్ అలర్ట్.. బీమా పాలసీలో మీ పేరుతో డబ్బు ఉందా? అర్జెంట్‌గా చెక్ చేయండి.. అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ ఇలా తెచ్చుకోండి!

Unclaimed Amounts : అన్ క్లెయిమ్డ్ అమౌంట్ గురించి మీకు అవగాహన ఉందా?పాలసీదారులకు సంబంధించి అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ కోట్లాది వరకు ఇన్సూరెన్స్ కంపెనీల వద్దనే మిగిలిపోతున్నాయి.

Unclaimed funds

Unclaimed Funds : మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ చేశారా? కొన్నాళ్లకు చాలామంది తాము ఒక పాలసీ వేశామనే విషయమే మర్చిపోతుంటారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే దానికి సంబంధించి నామినీలకు కూడా అసలు తెలిసే పరిస్థితి ఉండదు. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారులకు Unclaimed Amounts) సంబంధించి అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ కోట్లాది రూపాయల వరకు ఇన్సూరెన్స్ కంపెనీల వద్దనే మిగిలిపోతున్నాయి. అనేక ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద సుమారు రూ.25వేల కోట్లు అన్ క్లెయిమ్డ్ అమౌంట్ ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.

ఈ ఇన్సూరెన్స్ పాలసీ అన్ క్లెయిమ్డ్ అమౌంట్ విషయంలో చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. లేదంటే ముఖ్యమైన డాక్యుమెంట్లు మిస్ చేసుకోవడం వంటి కారణాలత ఈ మొత్తాన్ని క్లెయిమ్‌ చేయకపోవడంతో అలానే ఉండిపోతున్నాయి. మీ పాలసీకి సంబంధించి కూడా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఉందా? లేదా? ఉంటే ఎంత మొత్తంలో ఉంది? ఎలా పొందాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. .

అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ ఏంటి? :
సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగదారుడికి అన్ క్లెయిమ్డ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల సదరు వ్యక్తి సంప్రదించలేవు. 12 నెలల కన్నా అమౌంట్ అలాగే ఉంటే అలాంటి మొత్తాన్ని అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ అని అంటారు. ఇందులో హెల్త్‌ బెన్‌ఫిట్‌ క్లెయిమ్, డెత్‌ క్లెయిమ్‌లు, సర్వైవల్‌, సరెండర్‌, అడ్వాన్స్ విత్‌డ్రా, మెచ్యూరిటీ క్లెయిమ్‌ ప్రీమియం అధికంగా చెల్లించడం వంటి సందర్భాల్లో ఈ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఉండిపోతాయి.

అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ ఇలా :
ఇన్సూరెన్స్ కంపెనీ పరంగా అధికారిక వెబ్‌సైట్‌లో అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్‌కు సంబంధించి స్పెషల్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ప్రతి ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా పాలసీదారుడి వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. బీమా కంట్రోలింగ్ కంపెనీ IRDAIకి చెందిన బీమా భరోసా పోర్టల్‌ (Bhima bharosa) ద్వారా కూడా పొందొచ్చు.

Read Also : Black Friday Sale : బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు.. ఈ ఆపిల్ ఐఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఔట్‌స్టాండింగ్ డీల్స్ భయ్యా.. మీ బడ్జెట్ ధరలోనే..!

లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల వెబ్‌సైట్‌ లింకులు కనిపిస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మీ అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా అక్కడి ఇన్సూరెన్స్ కంపెనీ లింక్‌పై చెక్ చేయడమే.

అప్పుడు ఆ కంపెనీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్‌ అవుతారు. అక్కడ పాలసీదారుడి పేరు, పుట్టిన తేదీ, పాన్‌ నంబర్‌, పాలసీ నంబర్‌ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందులో కనీసం రెండు ఫీల్డులు అయినా పూరించాల్సి ఉంటుంది. ఒకవేళ వారి వద్ద ఉన్న వివరాలతో మ్యాచ్‌ అయితే అక్కడే ఆ వివరాలు కనిపిస్తాయి. ఆపై కేవైసీ డాక్యుమెంట్లు చూపించి బీమా మొత్తాన్ని పొందొచ్చు.

ఎలా సంప్రదించాలి? డాక్యుమెంట్లు ఇవేనా? :

సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీదారుల నామినీలు, వారసులు తమకు సంబంధించి గుర్తింపు డాక్యుమెంట్లను సమర్పించి ఈ అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ పొందవచ్చు. అయితే, ఇందులో పాలసీ డాక్యుమెంట్‌, పాలసీ వివరాలు, బ్యాంక్‌ అకౌంట్ వివరాలు, అప్లయ్ చేసే వ్యక్తి ఫొటో ఐడెంటిటీ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, కేవైసీ డాక్యుమెంట్లు, అడ్రస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు, క్లెయిమ్‌ డాక్యుమెంట్లు, పాలసీదారుడి డెత్ సర్టిఫికేట్, హాస్పిటల్‌ రికార్డులు వంటివి తప్పనిసరిగా అవసరం.

మీకు అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ విషయం తెలిస్తే.. వెంటనే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి. ఆ సమయంలో బీమా సంస్థ అడిగిన డాక్యుమెంట్లను సమర్పిస్తే సరిపోతుంది. న్యాయపరంగా వివాదాలు లేకుంటే మీకు రావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఎన్‌ఆర్‌ఐలు సైతం అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ ఇన్సూరెన్స్ భరోసా పోర్టల్‌లో చెక్ చేసుకుని అప్లయ్ చేసుకోవచ్చు.