Big EV Car Offers : మార్చి మాస్టర్ డీల్.. ఈ ఎలక్ట్రిక్ కార్లపై రూ. 10 లక్షల వరకూ డిస్కౌంట్లు.. ఏ కారుపై ఎంత తగ్గిందంటే?

Big EV Car Offers : ఎలక్ట్రిక్ కార్లను కొనేవారికి గుడ్ న్యూస్.. టాటా మహీంద్రా, హ్యుందాయ్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఏ కారుపై ధర ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Big EV Car Offers ( Image Credit : Gemini AI )

  • కొత్త ఎలక్ట్రిక్ కార్లు కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు
  • టాటా నుంచి హ్యుందాయ్ వరకు ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు
  • ఈవీలపై టాటా రాయితీలు, బంపర్ డిస్కౌంట్లు

Big EV Car Offers : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లుతున్నారు. ఈవీలను కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు భారత మార్కెట్లో ఈవీలను తక్కువ ధరకే అందిస్తున్నాయి.

ఈవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే అసలు ఆలస్యం చేయవద్దు. అనేక ప్రముఖ ఈవీలపై కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇప్పుడు ఒక ఈవీని కొనడం ద్వారా మీరు లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఇందులో టాటా, మహీంద్రా హ్యుందాయ్ ఈవీలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. ఇలా కొన్నారంటే గెలాక్సీ S26 అల్ట్రా సగం రేటుకే.. నెలకు రూ. 749 EMI

ఈవీలపై టాటా రాయితీలు :
ప్రస్తుతం టాటా టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలతో సహా అనేక ఈవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ప్రస్తుతం టాటా టియాగో ఈవీపై రూ. 2.1 లక్షల వరకు ఆఫర్లను అందిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీపై రూ. 1.2 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. కర్వ్ ఈవీపై కూడా రూ. 3.8 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా ఈవీలపై భారీ తగ్గింపు ఆఫర్లు :
కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా ప్రస్తుతం ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మహీంద్రా XUV400 ఈవీ ప్రస్తుతం రూ. 4 లక్షల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. మహీంద్రా BE 6, XEV 9e మోడళ్లు ప్రస్తుతం రూ. 2.95 లక్షల వరకు డిస్కౌంట్లతో లభిస్తున్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 :
ప్రస్తుతం హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఈవీపై రూ. 10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు 2024 స్టాక్‌కు వర్తిస్తాయి. హ్యుందాయ్ ఐయోనిక్ 5 2025 మోడల్‌పై కూడా రూ. 2 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.