8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో DA ప్రకటన..? భారీగా పెరగనున్న జీతాలు!
8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో డీఏ ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంది.
- Sreehari A
- Updated on- June 22, 2026 / 08:21 PM IST
8th Pay Commission
- సెప్టెంబర్‌లో డీఏ ప్రకటించే ఛాన్స్
- జూన్ 15తో ముగిసిన డెడ్ లైన్
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెంపు?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అతి త్వరలో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఇప్పుడు డీఏ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అన్ని సూచనలను సమర్పించే గడువు దగ్గర పడింది. ఈ నేపథ్యంలో డీఏ పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి.
వాస్తవానికి, ఏడాదికి రెండుసార్లు డీఏ, డీఆర్ ప్రకటిస్తారు. జనవరి (8th Pay Commission) 2026 నాటికి డీఏ, డీఆర్ 2 శాతం పెంచారు. దాంతో మొత్తం 60 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్‌లో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే, 8వ వేతన సంఘానికి వివిధ ఉద్యోగ సంఘాలు, అధికారులు, పింఛనుదారులు వినతిపత్రాలు, సూచనలు సమర్పించేందుకు గడువు 2026 జూన్ 15తో ముగిసింది. ఈ కీలక దశ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి డీఏ ప్రకటనపై పడింది. డీఏను వచ్చే సెప్టెంబర్‌లో ప్రకటిస్తారని భావిస్తున్నారు.
Read Also : REON Pocket AC : పోర్టబుల్ ఫ్యాన్లకు గుడ్‌బై… ఇక మెడలోనే AC పెట్టుకుని బయట తిరగండి.. కూల్‌గా చిల్ అవ్వండి..
8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి జీతం, భత్యాలు పెన్షన్ నిర్మాణంపై కీలక సూచనలను కోరింది. ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ ప్రకారం.. కమిషన్ భాగస్వాములతో సంప్రదింపుల కీలక దశను పూర్తి చేసింది. ఇప్పుడు, కమిషన్ ఉద్యోగులు, న్యాయాధికారులు, పెన్షనర్ల నుంచి అందిన వినతిపత్రాలను క్షుణ్ణంగా సమీక్షించి ఆపై నిర్ణయాన్ని తీసుకోనుంది.
డీఏ ఎలా నిర్ణయిస్తారంటే? :
కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం (DA) ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) ఆధారంగా లెక్కిస్తారు. ఏప్రిల్ 2026లో ఈ సూచిక 0.8 పాయింట్లు పెరిగి 149.9కి చేరింది.
డీఏను నిర్ణయించేందుకు ప్రభుత్వానికి కనీసం రెండు నెలల డేటా అవసరం. జూలై-డిసెంబర్ కాలానికి డీఏను కేవలం జూలై డేటా ఆధారంగా నిర్ణయించలేరు. అందుకే ప్రభుత్వం 2 నుంచి 3 నెలల సగటు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
కమిషన్‌కు ఇంకా 10 నెలల టైమ్ :
8వ వేతన సంఘం ఫైనల్ రిపోర్టును రెడీ చేయడానికి ఇప్పుడు 10 నెలల సమయం ఇంకా మిగిలి ఉంది. అంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలలో భారీ సవరణలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్టే..
ఉద్యోగుల కీలక డిమాండ్లు ఇవే :
- కేంద్ర ఉద్యోగుల సంస్థలు, యూనియన్ల వినతిపత్రాలలో ఈ డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి.
- ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంచాలి.
- కనీస ప్రాథమిక వేతనం భారీగా ఉండాలి
- పాత పింఛను పథకాన్ని (OPS) పునరుద్ధరించాలి లేదంటే NPS/UPSను రివ్యూ చేయాలి.
- హెచ్‌ఆర్‌ఏ, రిస్క్ పే, బోనస్, హాలిడే బెనిఫిట్స్, ఇతర సర్వీసు సంబంధిత సౌకర్యాలను మెరుగుపరచాలి.
