REON Pocket AC : పోర్టబుల్ ఫ్యాన్లకు గుడ్‌బై… ఇక మెడలోనే AC పెట్టుకుని బయట తిరగండి.. కూల్‌గా చిల్ అవ్వండి..
REON Pocket AC : ఈ సోనీ రియాన్ పాకెట్ సిరీస్ ఏసీ మెడకు ధరించడం ద్వారా అది నేరుగా చర్మానికి తాకి కూలింగ్ అందిస్తుంది. మంచి ఎయిర్ కండీషనర్ లా పనిచేస్తుంది..
REON Pocket AC
Portable Fans : అబ్బబ్బా.. ఎండలు మండిపోతున్నాయి.. కాసేపు ఇంట్లో ఏసీ, కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి.. అదే బయటకు వెళ్తే ఎలా అంటారా? పోర్టబుల్ ఫ్యాన్ ఉంది కదా అంటారా? అవి ఏమాత్రం కూలింగ్ ఇవ్వలేవు.. అందుకే మీకోసం అద్భుతమైన వేరబుల్ కూలింగ్ డివైజ్‌లు వచ్చేశాయి.. మీ ప్రయాణంలో కూడా హాయిగా చల్లని గాలిని ఎంజాయ్ చేయొచ్చు..
ఈ వేసవిలో 45 డిగ్రీల ఎండల్లో కూడా పోర్టబుల్ ఫ్యాన్లు హై కూలింగ్ అందించవు.. ట్రెడిషనల్ పోర్టబుల్ ఫ్యాన్ల కన్నా వేరబుల్ కూలింగ్ డివైజ్ లే బెటర్ అంటున్నారు జనం..
ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన వేరబుల్ డివైజ్ లలో సోనీ రియాన్ పాకెట్ సిరీస్ ఒకటి.. ఇది మెడ వద్ద (REON Pocket AC) ధరిస్తే చాలు.. మీ చర్మానికి తాకుతూ చల్లని గాలిని అందిస్తుంది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే పర్సనల్ వేరబుల్ కూలింగ్ డివైజ్ అనమాట..
పోర్టబుల్ ఫ్యాన్‌లా కాకుండా సోనీ రియాన్ పాకెట్ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. ఇందులో థర్మో ఎలెక్ట్రిక్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అది మెడపై ఈజీగా ధరించవచ్చు. చర్మాన్ని తాకేలా మెటల్ ప్లేట్ కూడా ఉంది. అది శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. ఈ వేరబుల్ డివైజ్ వేసవి, చలికాలంలోనూ వాడుకోవచ్చు.
ఇదేలా పనిచేస్తుందంటే? :
ఈ డివైజ్ మెడకు ధరించన తర్వాత చర్మంపై ఉష్ణోగ్రతను మానిటరింగ్ చేస్తుంది. సెన్సార్ల ద్వారా టెంపరేచర్ స్థాయిని గుర్తిస్తాయి. గాలి ఉష్టోగ్రత ఆధారంగా ధరించిన వ్యక్తికి తగిన కూలింగ్ అందించగలదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఆటోమాటిక్ గా కూలింగ్ స్థాయిని పెంచుతుంది లేదంటే తగ్గిస్తుంది అనమాట.
సోనీ రియాన్ పాకెట్ డివైజ్ స్పెషాలిటీ ఏంటంటే.. హ్యాండ్స్ ఫ్రీగా ఉంటుంది. చాలావరకూ దుస్తుల కింద ఉండటం వల్ల బయటకు పెద్దగా కనిపించదు. ప్రయాణ సమయాల్లో లేదా ప్రొఫెషనల్ వర్కింగ్ సమయాల్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. అదే పోర్టబుల్ ఫ్యాన్ అయితే చేతితో పట్టుకోవాలి.. బయటకు కనిపించేలా ఉంటాయి.
ప్రస్తుతానికి భారతీయులకు ఈ కూలింగ్ డివైజ్ అందుబాటులో లేదు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారి దగ్గర నుంచి ప్రయాణాలు చేసే వారికి సరసమైన ధరలో లభిస్తే చాలా బాగుంటుంది..
