Samsung Galaxy M36 5G
Samsung Galaxy M36 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్ భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ రూ. 15వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాదు.. బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్‌లతో కూడా ఇంకా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
కెమెరా, బ్యాటరీ వంటి మరెన్నో ఆకట్టుకునే (Samsung Galaxy M36 5G) ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ ఆన్‌లైన్‌లో ఈజీగా ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్‌లో ఈ శాంసంగ్ ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఆఫర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 6GB ర్యామ్ + 128GB వేరియంట్‌లో వస్తుంది. ధర రూ. 22,999కు పొందవచ్చు. అమెజాన్ సేల్ నుంచి 39శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ శాంసంగ్ ఫోన్ రూ. 13,999కి కొనుగోలు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు :
ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ల ద్వారా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రూ. 419 తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. రూ. 13,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా తగ్గింపు ఉంటుంది. మీరు రూ. 679 ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.
Read Also : iPhone 13 Sale : అమెజాన్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
డిస్‌ప్లే :
ఈ శాంసంగ్ 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..మల్టీ టాస్కింగ్ కోసం ఇన్-హౌస్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది.
ఫొటో, వీడియోగ్రఫీ :
ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP, OIS సపోర్ట్‌తో వస్తుంది. అల్ట్రావైడ్ కెమెరా 8MP, 2MP మాక్రో సెన్సార్ ఉంది. అయితే, ఫ్రంట్ కెమెరాలో సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉంది. పవర్ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W USB టైప్-C ఛార్జింగ్‌తో వస్తుంది. Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్, ఏఐ ఫీచర్లతో వస్తుంది.