BSNL New Year Offer : BSNL న్యూ ఇయర్ ఆఫర్.. జస్ట్ రోజుకు రూ. 8తో 3GB హైస్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్.. 365 రోజులు అన్ని ఫ్రీ..!
BSNL New Year Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.. రీఛార్జ్ ధర ఎంతంటే?
BSNL New Year Offer BSNL New Year Offer
BSNL New Year Offer : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ అదిరింది. 2026 కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది.
డిసెంబర్ 26 నుంచి కంపెనీ పూర్తి ఏడాది వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న అనేక రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు డేటా బోనస్‌లను ఆఫర్ చేస్తోంది.
బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 2,799 వార్షిక ప్లాన్ :
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే.. బీఎస్ఎన్ఎల్ ఇండియా అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. రూ. 2,799 ధరతో ఈ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీతో పాటు సరసమైన కనెక్షన్ కోరుకునే యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
కాలింగ్ కోసం దేశమంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్‌తో సహా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. ఇంటర్నెట్ యూజర్లు ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఏడాది పొడవునా తగినంత ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు. అదనంగా, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ కూడా అందుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రోజుకు సుమారు రూ. చెల్లిస్తే చాలు.
రూ. 2,399, రూ.2,799 ప్లాన్‌ల మధ్య తేడా ఏంటి? :
బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే రూ. 2,399కి ఒక ఏడాది ప్లాన్ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఇప్పుడు, కొత్త రూ. 2,799 ప్లాన్‌తో వినియోగదారులు కేవలం రూ. 400తో రోజుకు అదనంగా 1GB డేటాను పొందవచ్చు. మీరు ఏడాదికి దాదాపు 365GB అదనపు డేటాను పొందవచ్చు. ప్రతి అదనపు GB ఖర్చవుతుంది. రూ. 1.10 మాత్రమే. ఎక్కువగా ఇంటర్నెట్ వాడే వారికి కొత్త ప్లాన్ అత్యంత ప్రయోజనకరంగా ఉండవచ్చు.
కొత్త ఏడాదికి స్పెషల్ డేటా బోనస్ :
బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లతో పాటు నూతన సంవత్సర క్రిస్మస్ ఆఫర్‌లను కూడా ప్రవేశపెట్టింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 31, 2026 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ. 2,399 వార్షిక ప్లాన్ రోజుకు 2GBకి బదులుగా 2.5GB డేటాను కూడా అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ అందించే స్వల్పకాలిక ప్లాన్‌లో రూ. 225, రూ. 347,రూ. 485 రీఛార్జ్ ప్లాన్‌లపై రోజుకు 0.5GB అదనపు డేటాను అందిస్తోంది. ఎక్కువ ఇంటర్నెట్‌ను యాక్సస్ చేయొచ్చు.
జియో ఏడాది రీఛార్జ్ ప్లాన్ :
మీరు ప్రతినెలా రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు. జియో ఏడాది పొడవునా రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. రిలయన్స్ జియో ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రూ. 1748 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ఒక్క రీఛార్జ్‌తో మీ జియో సిమ్ 336 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది.
దాదాపు 11 నెలల పాటు ప్లాన్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ మాత్రమే కాదు. బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అదనంగా ఫ్రీ SMS కూడా పొందవచ్చు.
